
ఒకవైపు, బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసినట్లు చెబుతుంటే, మరోవైపు, మద్య నిషేధాన్ని బహిర్గతం చేసే సంఘటన సోమవారం సాయంత్రం సివాన్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సివాన్-మైర్వా ప్రధాన రహదారిలోని జంసిక్రీ గ్రామం సమీపంలో మద్యం సీసాలను తరలిస్తున్న స్కార్పియో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. అది గమనించిన జనాలు దగ్గరకు వెళ్లి చూడగా అందులో మద్యం సీసాలు ఉన్నట్టు మనించింది. క్షణాల్లో వాటిని లూటీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనం పడిపోయిన వెంటనే, సమీపంలోని గ్రామస్తులు, బాటసారులు ఒక్కసారిగా గుమిగూడారు. వాహనంలో పెద్ద మొత్తంలో మద్యం నిండి ఉందని తెలుసుకున్న ప్రజలు గుంతలోకి దిగి స్కార్పియో అద్దాన్ని పగలగొట్టి అందులోని మద్యం సీసాను ఎత్తుకెళ్లారు. కొందరు సంచులలో మద్యం తీసుకెళ్తుండగా, మరికొందరు గుంతలో ఉండి బయట ఉన్న తమ సహచరులకు బాటిళ్లను అందజేస్తున్నారు. ఈ దోపిడీ దాదాపు అరగంట పాటు కొనసాగింది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా సమయం వరకు ఏ పోలీసు వాహనం కూడా అక్కడికి రాలేదు. అయితే ఇదే అదునుగా భావించిన స్కార్పియో డ్రైవర్ మెళ్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.ఇక పోలీసులు వచ్చే సమయానికి, కారులో ఒక్క మద్యం బాటిల్ కూడా మిగల్చలేదు స్థానికులు. ఈ సంఘటనపై ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అశోక్ కుమార్ దాస్ మాట్లాడుతూ, పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందిందని అన్నారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి, ప్రజలు ప్రతి మద్యం బాటిల్‌ను తీసుకెళ్లారు. ప్రస్తుతం, కారును స్వాధీనం చేసుకున్నాం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామయని తెలిపారు.
వీడియో చూడండి..
Breaking, Bihar Prohibition Policy News: बिहार में शराबबंदी कानून की उड़ी धज्जियां, Siwan में स्कॉर्पियो से शराब की लूट, वीडियो वायरल
पढ़ें पूरी खबर:https://t.co/uDhh4eycBK#Bihar #biharNews #siwan pic.twitter.com/vlaYatErgZ
— Rashtra Bharat (@RBharatdigital) September 15, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.