Viral: ఆశగా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేశాడు.. తీరా కనిపించింది చూసి కళ్లు తేలేశాడు

ఆశగా ఆన్‌ లైన్ లో ఇష్టమైన వస్తువును ఆర్డర్ పెట్టాడు. కొన్ని రోజులకు ఆ వస్తువు ఇంటికి వచ్చింది. సంతోషంతో దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ పార్శిల్ లో వచ్చిన వస్తువు చూసి.. ఆ వివరాలు ఇలా..

Viral: ఆశగా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేశాడు.. తీరా కనిపించింది చూసి కళ్లు తేలేశాడు
Viral News

Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2025 | 1:22 PM

అమెజాన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురయింది. ఈ మధ్యకాలంలో చాలామందికి మొబైల్ ఫోన్లతో పాటు ఏదైనా కొనాలి అంటే ఆన్లైన్‌లోనే ఆర్డర్ పెట్టడం అలవాటుగా మారిపోయింది. దీనిని అదునుగా చేసుకున్న కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కథలు కొత్తవి ఏమి కాదు.. అయినప్పటికీ ఈ మోసాలు తరచూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆన్లైన్‌లో మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్ లాంటి విలువైన వస్తువులు ఆర్డర్లు పెడుతూ చివరికి ఆర్డర్స్ వచ్చి చూసేసరికి ఖంగు తింటున్నారు కస్టమర్లు.

కొద్ది రోజుల క్రితం కూకట్‌పల్లి ప్రాంతంలో యూట్యూబ్‌లో వీడియోలు చేసుకునేందుకు భార్య కోసం భర్త ట్యాబ్‌ను ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన కొద్ది రోజులకు ఆ పార్శిల్ ఇంటికి వచ్చింది. దీంతో వచ్చిన పార్శిల్‌ను ఎంతో సంతోషంతో ఓపెన్ చేశారు. ఇంకేం ఉంది పార్శిల్ చూసిన సదరు వ్యక్తి షాక్‌కి గురి అయ్యాడు. ట్యాబ్‌ను ఆర్డర్ పెడితే ఆ పార్శిల్ బాక్స్‌లో సబ్బులు పెట్టి పంపించారు. ఇప్పుడు తాజాగా బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి అమెజాన్‌లో 1.87 లక్షల రూపాయలు విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7 ఫోన్ ఆర్డర్ చేశాడు.

అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఫోన్‌కి బదులు అందులో ఒక టయిల్ ముక్క ఉంది. దీంతో షాక్‌కు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు బాధితుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇలా ఆన్లైన్‌లో విలువైన వస్తువులను ఆర్డర్ పెట్టే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.