ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌కు దారి చూపించిన యూట్యూబర్‌.. ఈ వీడియో చూసి శభాష్ అనాల్సిందే!

|

Mar 25, 2025 | 8:00 PM

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌లో రెడ్‌ సిగ్నల్‌ వద్ద ఒక అంబులెన్స్‌ ఇరుక్కుపోయి కనిపిస్తుంది. రోడ్డుకు అవతలి వైపున ఒక యూట్యూబర్ బైక్‌పై వెళ్తున్నాడు. కిలో మీటర్ల మేర రద్దీ, రెడ్‌ సిగ్నల్‌ పడివుండటంతో అంబులెన్స్‌ ముందుకు కదలలేని స్థితిలో ఉండటం అతడు గమనించాడు..అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే అతడు చాకచక్యంగా వ్యవహరించాడు.

ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌కు దారి చూపించిన యూట్యూబర్‌.. ఈ వీడియో చూసి శభాష్ అనాల్సిందే!
Ambulance
Follow us on

బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ చాలా కాలంగా ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా అంబులెన్స్‌ల వంటి అత్యవసర సేవలకు సైతం ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. బెంగళూరు ట్రాఫిక్‌ కష్టాలకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్‌నెట్‌లో తరచూ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్‌కు దారి కల్పించేందుకు ఓ యూట్యూబర్ ఎవరు చేయని పని చేశాడు. అతడు చూపిన చొరవతో ప్రజలు అతన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌లో రెడ్‌ సిగ్నల్‌ వద్ద ఒక అంబులెన్స్‌ ఇరుక్కుపోయి కనిపిస్తుంది. రోడ్డుకు అవతలి వైపున ఒక యూట్యూబర్ బైక్‌పై వెళ్తున్నాడు. కిలో మీటర్ల మేర రద్దీ, రెడ్‌ సిగ్నల్‌ పడివుండటంతో అంబులెన్స్‌ ముందుకు కదలలేని స్థితిలో ఉండటం అతడు గమనించాడు..అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే అతడు చాకచక్యంగా వ్యవహరించాడు. అంబులెన్స్ కు దారి కల్పించేందుకు అతడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. వాయు వేగంతో అతడు సిగ్నల్‌ వద్దకు వెళ్లిపోయాడు.. సిగ్నల్‌ వద్ద అన్ని వైపులా వస్తున్న వాహనాలను అడ్డుకున్నాడు. రోడ్డు మధ్యలో అంబులెన్స్‌ ఆగిపోయిన విషయాన్ని వాహనదారులకు అర్థమయ్యేలా చెబుతూ..వాహనాల రాకపోకలను ఆపేసి అంబులెన్స్‌కు దారి కల్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు..

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

బెంగళూరు నగరంలో ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలోనే రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఒక అంబులెన్స్ రోడ్డు మధ్యలో చిక్కుకుంది. ఈ సందర్భంలో ఒక యూట్యూబర్ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి అంబులెన్స్‌కు మార్గం కల్పించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మానవతా కోణంలో యూట్యూబర్‌ చేసిన పనికి ప్రజల నుంచి విస్తృత ప్రశంసలు అందుకుంటున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..