Viral Video: మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది..! ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే..

బెంగళూరు వీధుల్లో విదేశీ పర్యాటకుడు పాబ్లో గార్సియా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు పక్కనే మరో ఆటోలో ఒక దూడను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ వైరల్ వీడియో లక్షలాది మందిని ఆకర్షించి, భారతదేశంలో కనిపించే విభిన్న ఆశ్చర్యకరమైన సంఘటనలకు నిదర్శనంగా నిలిచింది. ప్రజలు దీనిపై ఎన్నో కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది..! ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే..
Calf In Auto

Updated on: Dec 06, 2025 | 8:01 PM

భారతదేశ వీధుల్లో తరచుగా ఏదో ఒక ఆశ్చర్యమైన సంఘటన కనిపిస్తూనే ఉంటుంది. ఈ సారి బెంగళూరు వీధుల్లో కనిపించిన ఒక దృశ్యం ఒక విదేశీ పర్యాటకుడిని ఆకర్షించింది. అతడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం వీడియోను ఆ విదేశీ పర్యాటకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఇంటర్‌నెట్‌లో ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఆ విదేశీ పర్యాటకుడి పేరు పాబ్లో గార్సియా ప్రస్తుతం అతను భారతదేశాన్ని సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోన అతడు బెంగళూరు వెళ్లినట్టుగా తెలిసింది. అక్కడ గార్సియా ఆటోలో వెళ్తుండగా, తన ఆటో పక్కనే మరో ఆటోరిక్షా వెళుతుండటం చూస్తున్నాడు. లోపల కూర్చున్న ప్రయాణీకుడిని చూసి అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇతర ప్రయాణీకుల మాదిరిగానే తన పక్కనే ఉన్న ఆటోరిక్షాలో ఒక చిన్న దూడ హాయిగా ప్రయాణిస్తుండటం కనిపించింది. ఆ సీన్‌ చూడగానే ఆ దూడ ప్రతిరోజూ ఆటోరిక్షాలోనే ప్రయాణిస్తున్నట్టుగా అనిపించింది.

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే పాబ్లో తన ఫోన్ తీసి ఆ క్షణాన్ని వీడియో తీశాడు. అతను దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.. భారతదేశంలో ఎన్నో అద్బుతాలు, అత్యుత్తమ ఆశ్చర్యాలు ఉన్నాయని వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. లక్షలాది మంది దీనిని చూశారు. వేలాది మంది దీనిని లైక్ చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో కామెంట్‌ విభాగం ఇప్పటికే వందలాది కామెంట్స్‌తో నిండిపోయింది. చాలామంది దీనిని క్లాసిక్ బెంగళూరు అని పిలుస్తున్నారు. మరికొందరు దీనిని భారతదేశంలో నివసిస్తున్న అద్భుతమైన ప్రజల ఘనత అని పిలుస్తున్నారు.. ఒక వినియోగదారు ఈ వీడియోపై భారతదేశానికి స్వాగతం బ్రో! అని రాస్తూ కామెంట్‌ చేశారు.. మరొకరు కేరళలో ఒక ఆటోలో మేక ప్రయాణించడం చూసిన తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..