Bengaluru: సిలికాన్‌ సిటీలో నయా ట్రెండ్‌.. పెంపుడు జంతువులుగా కొండచిలువలు.. ఈ అర్హతలన్నీ ఉంటేనే..

|

Jul 24, 2023 | 7:27 PM

ఇక్కడ కొండచిలువలకు రూ. 35 వేల నుంచి 12 లక్షల వరకు పలుకుతుంది. పైగా వీటికి గిరాకీ కూడా భారీగానే ఉంది. అంతేకాదు..వివిధ రకాల తాబేళ్లను కూడా ఇళ్లలో ఉంచుకుంటే మంచిదని భావించి చాలా మంది ప్రజలు వాటిని కూడా పెంపుడు జంతువులుగా ఇళ్లలో పెంచుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Bengaluru: సిలికాన్‌ సిటీలో నయా ట్రెండ్‌.. పెంపుడు జంతువులుగా కొండచిలువలు.. ఈ అర్హతలన్నీ ఉంటేనే..
Pet Shops Of Bengaluru
Follow us on

Bengaluru: తాబేలు, కుందేలు వంటి చిన్న జంతువులు, అందమైన పక్షులు వంటి వాటిని చాలా మంది జంతుప్రేమికులు తమ ఇళ్లలో పెంచుకుంటుంటారు. ఇక కుక్కలు, పిల్లులు వంటివి సర్వసాధారణమే. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. భారీ విష సర్పాలు, భయంకర కొండచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం ప్రారంభించారు. కొండచిలువలు ఇప్పుడు ప్రజల అభిమాన పెంపుడు జంతువులుగా మారిపోయాయి. ఒకప్పుడు కుక్కలు, పిల్లుల చిత్రాలు తీసి వాటికి స్టేటస్ పెట్టేవారు. ఇప్పుడు కొండచిలువను ఇంట్లో సభ్యుడిగా, ప్రేమగా పెంచుకోడం చూస్తుంటే..ఇప్పుడు సిలికాన్‌ సిటీ బెంగళూరులో ఈ కొండచిలువకు డిమాండ్‌ కనిపిస్తోంది.. ఈ విషయం మేం చెప్పడం కాదు.. దీనిపై జంతువుల దుకాణం యజమానులు ఏం చెబుతున్నారో తెలుసా..?

బెంగళూరు నగర ప్రజల ఈ కొత్త క్రేజ్ గురించి దుకాణ యజమాని ఒకరు మాట్లాడుతూ..ఇలాంటి భారీ కొండచిలువల నిర్వహణ తక్కువగా ఉంటుంది. కాబట్టి, నగర ప్రజలు ఈ కొండచిలువలను పెంచుకోవడం మొదలుపెట్టారని అన్నారు. సాధారణ పెంపుడు జంతువులు చాలా ఖర్చుతో కూడుకున్నవి.. కానీ, కొండచిలువకు నెలకు 400 రూపాయలు మాత్రమే ఖర్చుఅవుతుందన్నారు. అలాగని మీరు దీన్ని ఎలా పడితే అలా కొనుగోలు చేయలేరు. ఈ పామును కొనడానికి మీకు అర్హత ఉందో లేదో దుకాణదారుడు తనిఖీ చేస్తాడు. అలాగే మీ దగ్గర ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కూడా తప్పనిసరిగా ఉండాలి… ఈ డాక్యుమెంట్లన్నీ ఉంటేనే కొండచిలువను కొనుగోలు చేయవచ్చు.

ఇక్కడ కొండచిలువలకు రూ. 35 వేల నుంచి 12 లక్షల వరకు పలుకుతుంది. పైగా వీటికి గిరాకీ కూడా భారీగానే ఉంది. అంతేకాదు..వివిధ రకాల తాబేళ్లను కూడా ఇళ్లలో ఉంచుకుంటే మంచిదని భావించి చాలా మంది ప్రజలు వాటిని కూడా పెంపుడు జంతువులుగా ఇళ్లలో పెంచుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..