Viral Videos: ఫ్యామిలీతో ఫంక్షన్‌కు వస్తే .. జనాలు పరుగులు పెట్టారు.. ఏం జరిగిందంటే..

|

Feb 20, 2022 | 6:53 PM

పెళ్లి ఓ అందమైన వేడుక.. మనదేశంలో పెళ్ళికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్‌గా జరుగుతుంటాయి. పెళ్లిళ్లకు భారీ ఏర్పాట్లు చేస్తారు.. బంధువులు భారీగా తరలి వస్తారు.

Viral Videos: ఫ్యామిలీతో ఫంక్షన్‌కు వస్తే .. జనాలు పరుగులు పెట్టారు.. ఏం జరిగిందంటే..
Wedding Function
Follow us on

Viral Videos: పెళ్లి ఓ అందమైన వేడుక.. మనదేశంలో పెళ్ళికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. పెళ్లిళ్లకు భారీ ఏర్పాట్లు చేస్తారు.. బంధువులు భారీగా తరలి వస్తారు. ఇక పెళ్ళిలో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. పాటలు, డ్యాన్స్ లు బంధువుల కబుర్లు నానా హంగామాగా ఉంటుంది. అయితే బంధువులతోపాటు ఓ వివాహ వేడుకకు ఓ అనుకోని అతిథి వచ్చింది. అదికూడా ఫ్యామిలీతో.. ఇద్దరు పిల్లలతో పెళ్లిరిసెప్షన్ కు వచ్చిన ఆ అనుకోని అతిథిని చూసి అక్కడ ఉన్నవారంతా పరుగులు తీశారు. అదేంటి ఫ్యామిలీతో ఫంక్షన్ కు వస్తే జనాలు పారిపోవడం ఏంటా అనుకుంటున్నారా..?

ఓ పెళ్లి రిసెప్షన్ కు అనుకోకుండా ఒక ఎలుగు బంటి తన పిల్లలతో వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ పార్టీలో ఈ సంఘటన జరిగింది. ఒక ఎలుగుబంటి తన రెండు పిల్ల బంటులను వీపు పై ఎక్కించుకొని రిసెప్షన్ స్టేజ్ పైకి వచ్చింది. కొద్దిసేపు అక్కడ తిరిగి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. IFS అధికారి పర్వీన్ కసన్ ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. IFS అధికారి పర్వీన్ కసన్ ఈ వీడియోకు వారు చేసిన ఏర్పాట్లు ఎలుగుబంటి నచ్చలేదు.. అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sitara Ghattamaneni: సీతూ పాప స్టెప్పులకు మహేష్ ఫిదా.. కళావతి పాటకు అదరగొట్టిన సితార..

Viral Photo: చారడేసి కళ్లు.. బూరె బుగ్గల ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపై ఈ చిన్నదానిదే హవా..

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..