Viral: పుట్టబోయే బిడ్డ కోసం స్కానింగ్.. ఆపరేషన్ చేయగా డాక్టర్లకు ఫ్యూజులు ఔట్!

|

Jun 29, 2022 | 1:31 PM

ఇదొక క్రేజీ న్యూస్. మీరూ చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓ ఆటో డ్రైవర్ తన భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించాడు...

Viral: పుట్టబోయే బిడ్డ కోసం స్కానింగ్.. ఆపరేషన్ చేయగా డాక్టర్లకు ఫ్యూజులు ఔట్!
Scaning
Image Credit source: Representative Image
Follow us on

ఇదొక క్రేజీ న్యూస్. మీరూ చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓ ఆటో డ్రైవర్ తన భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్లు ప్రసవానికి ముందు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. అందులో వారికి కవలలు కనిపించారు. సీన్ కట్ చేస్తే.. సదరు మహిళకు ఆపరేషన్ చేయగా డాక్టర్లకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఆ కథేంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఆటో డ్రైవర్ మనోజ్.. గర్భవతి అయిన తన భార్య ఖుష్బూను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం కోసం చేర్పించాడు. ఇక డాక్టర్లు ప్రసవానికి ముందు ఖుష్బూకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. అందులో కవల పిల్లలు కనిపించారు. అనంతరం ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఖుష్బూ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ముగ్గురు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

కాగా, దీనిపై మాట్లాడిన ఓ డాక్టర్.. తన సర్వీస్‌లో ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చాడు. మనోజ్ కుటుంబానికి అవసరమైన ఆర్ధిక సాయం చేస్తామని.. పిల్లల చదువులకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి