ఇంటికి వచ్చిన బంధువులకు పుట్టగొడుగులు వండిపెట్టిన మహిళ.. మాజీ అత్తమామలు సహా ముగ్గురు మృతి..

|

Nov 03, 2023 | 5:12 PM

గతంలోనూ ఓ వ్యక్తి ఎరిన్‌ పెట్టిన భోజనం కారణంగా అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు ఆరోపించారు. హత్యచేయాలనే ప్లాన్‌తో ఎరిన్ తన బంధువులను భోజనానికి ఆహ్వానించింది. వారికోసం ప్రత్యేకించి డెత్ క్యాప్ పుట్టగొడుగులను వండించింది. ఇవి విషపూరితమైనవి. వీటిని తింటే కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. జులై 29న తన ఇంట్లో ఈ ఘటన జరిగిన కారణంగా పోలీసులు ఆమెను విచారించగా, తాను కావాలని చేయలేదని పోలీసులకు చెబుతోంది.

ఇంటికి వచ్చిన బంధువులకు పుట్టగొడుగులు వండిపెట్టిన మహిళ.. మాజీ అత్తమామలు సహా ముగ్గురు మృతి..
Australia Woman
Follow us on

ఓ మహిళ తన బంధువులను భోజనానికి ఆహ్వానించింది. తినడానికి పుట్టగొడుగులతో ప్రత్యేకించి వంటకాలు సిద్ధం చేసి వడ్డించింది. ఆ తర్వాత ఆమె పెట్టిన భోజనం చేసిన వారిలో పలువురు అస్వస్థతకు గురికాగా, ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురి మరణానికి ఆ మహిళే హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, ఆమె మాత్రం తమ బంధువులంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉందని చెప్పింది. తాను ఎలాంటి తప్పిదం చేయలేదని చెప్పింది. కానీ, మూడు నెలల విచారణ అనంతరం పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఉదంతం ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. జరిగిన ఘటనతో పోలీసులే కాదు.. యావత్‌ దేశం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. నిందితురాలిని తూర్పు విక్టోరియాలోని వొంతగ్గి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

UK నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన 48ఏళ్ల ఎరిన్ పీటర్సన్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆమెను తూర్పు విక్టోరియాలోని వొంతగ్గి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎరిన్ పీటర్సన్‌ మాజీ భర్త తల్లిదండ్రులు డాన్ గెయిల్ పీటర్సన్ తల్లి 66 ఏళ్ల హీథర్ విల్కిన్సన్, 70ఏళ్ల తండ్రి మరణానికి సంబంధించి ఎరిన్‌ను పోలీసులు విచారించారు. ఎరిన్‌ ఐదుగురిపై హత్యాయత్నానికి పాల్పడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వారిలో ఎరిన్‌ మాజీ అత్తామాలు మరోకరు చనిపోయారని చెప్పారు. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ శుక్రవారం ఉదయం మోర్వెల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

2021- 2022లో విక్టోరియాలో రెండు సార్లు హత్యాయత్నం ఘటనలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. విక్టోరియాకు చెందిన ఓ వ్యక్తి ఎరిన్‌ పెట్టిన భోజనం కారణంగా అస్వస్థతకు గురయ్యాడని పోలీసులు ఆరోపించారు. హత్యచేయాలనే ప్లాన్‌తో ఎరిన్ తన బంధువులను భోజనానికి ఆహ్వానించింది. వారికోసం ప్రత్యేకించి డెత్ క్యాప్ పుట్టగొడుగులను వండించింది. ఇవి విషపూరితమైనవి. వీటిని తింటే కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. జులై 29న తన ఇంట్లో ఈ ఘటన జరిగిన కారణంగా పోలీసులు ఆమెను విచారించగా, తాను కావాలని చేయలేదని పోలీసులకు చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఎరిన్ తన మాజీ భర్త సైమన్ పీటర్సన్‌ను కూడా ఈ భోజనానికి ఆహ్వానించింది. కానీ చివరి నిమిషంలో అతను రావడానికి నిరాకరించాడు. అయితే, ఆ రోజు భోజనం తర్వాత ఎరిన్ పీటర్సన్‌తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ, మిగిలిన వారు మాత్రమే అస్వస్థతకు గురికావటం ముగ్గురు మరణించటంతో పోలీసులకు మొదటి నుంచి ఆమెపైనే అనుమానం ఉంది. కానీ, మొదట్లో ఆమె వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని, వారికి ఎలాంటి హాని చేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పింది. ఈ పుట్టగొడుగుల వల్ల తనకు ఇష్టమైన వారు అనారోగ్యం పాలయ్యారని తెలిసి చాలా బాధపడ్డానని చెప్పింది. కానీ, గత మూడు నెలల్లోనే పోలీసులు ఈ హత్యా కేసును మిస్టరీని చేధించారు.

ఇకపోతే, ఆస్ట్రేలియాలో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న ఈ డెత్ క్యాప్ మష్రూమ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది పుట్టగొడుగు జాతికి చెందినది. కానీ, చాలా విషపూరితమైనది. దీన్ని సులభంగా గుర్తించవచ్చు. ఇది తెల్లని గిల్ లాంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. పుట్టగొడుగు పండినప్పుడు గోధుమ రంగులోకి మారదు. ఇది ఆకుపచ్చ లేదా పసుపు రంగుతో తెల్లటి టోపీని కలిగి ఉంటుంది. డెత్ క్యాప్ మష్రూమ్‌ను తీసుకున్న చాలా గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. వికారం, విరేచనాలు, జీర్ణశయాంతర బాధలు కనిపిస్తాయి. ఇది మొదట కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. గతంలో భారత్‌లో దీన్ని తిని 6 మంది చనిపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..