After reading This you can’t stop laughing: స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఏ కొత్త విషయం కనిపించినా సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేయడం పరిపాటైపోయింది. సాధారణంగా రకరకాల వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఐతే తాజాగా ఓ స్కూల్ విద్యార్ధి పరీక్షల్లో రాసిన ఆన్సర్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. సదరు స్టూడెంట్‌కు తట్టిన ఆన్సర్ నభూతో నభవిష్యతి. ఎందుకు రాశాడో అర్ధం అయ్యాక నవ్వాగడం జరగని పని. అసలింతకీ ప్రశ్నేంటంటే..
ఇంగ్లీష్ గ్రామర్ పరీక్షలో గుడ్, బ్లాక్, ఒరిజినల్ అనే ప్రశ్నలకు వరుసగా బ్యాడ్, వైట్, చైనా అనే అన్సర్లు విద్యార్ధి రాశాడు. మొదటి రెండు ఆన్సర్లు సరైనవే. మూడో ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ రాశాడు. సాధారణంగా మర్కెట్లో కనిపించే అన్ని ఎలక్ట్రిక్ గాడ్టెట్స్‌లకు డూప్లికేట్లను తయారు చేయడంలో చైనా అమ్మపెనిమిటి వంటిది. ఆ విషయం నేటి కాలంలో ఎవరికైనా తెలుసు. అంటే మనోడికి కూడా తెలుసన్నమాట. ఇంకేముంది.. ఓరిజినల్ అని కనిపించగానే.. వెనకా.. ముందూ.. ఆలోచించకుండా వెంటనే ‘చైనా’ అని రాసేశాడు (టీచర్ ‘ఆర్టిఫీషియల్’ అని సమాధానం రాసి సరిచేశాడు). మనోడి పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పా అండీ..