శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఈ జూలో జంతువులకు స్పెషల్ అరేంజ్ మెంట్స్.. మామూలుగా ఉండవు మరి

|

Dec 18, 2022 | 11:01 AM

శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఈ జూలో జంతువులకు స్పెషల్ అరేంజ్ మెంట్స్.. మామూలుగా ఉండవు మరి చలికాలం వచ్చిందంటే చాలు వణుకు మొదలవుతుంది. చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి..

శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఈ జూలో జంతువులకు స్పెషల్ అరేంజ్ మెంట్స్.. మామూలుగా ఉండవు మరి
Zoo
Follow us on

చలికాలం వచ్చిందంటే చాలు వణుకు మొదలవుతుంది. చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు, జర్కీన్‌లు లేదా, గట్టిగా ఉండే దుస్తులు వాడుతుంటారు. మనుషులైతే.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమకు కావల్సిన సదుపాయాలను సమకూర్చుకుంటారు. మరి జంతువుల పరిస్థితి ఏమిటని ఎవరైనా ఆలోచించారా.. మనుషుల్లాగే జంతువులు కూడా చలికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాయి. ఇంట్లో మనకు కావాలంటే చలి మరీ ఎక్కువుగా ఉంటే హీటర్లు కూడా పెట్టుకుంటాం. కాని జంతువులకు ఈ సదుపాయాలు ఉంటాయా అంటే లేవనే సమాధానం వస్తుంది. కాని ఓడిశాలోని ఓ జూలో మాత్రం జంతువులకు శీతాకాలంలో స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఒడిశాలో మాత్రం నందన్‌కానన్ జూలాజికల్‌ పార్కు అధికారులు జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శీతాకాలంలో చలిగాలులనుంచి రక్షణ కల్పించేందుకు భువనేశ్వర్ సమీపంలోని నందన్‌ కానన్ జూలాజికల్ పార్క్‌లో ఉన్న జంతువులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ జంతు ప్రదర్శన శాలలో చింపాంజీలకు ప్లైవుడ్‌ తో రూం ఏర్పాటు చేసి, హీటర్లు పెట్టారు. బాగా చలిగా ఉన్నప్పుడు హీటర్లు ఆన్ చేయడం ద్వారా చింపాజీలు చలికి వణికిపోకుండా రక్షణ పొందుతాయి. అయితే అన్ని జంతువులకు హీటర్లు ఏర్పాటు చేయకుండా.. జంతువు స్వభావాన్ని బట్టి తగిన ఏర్పాట్లు చేశారు జూ అధికారులు.

మనుషుల స్వభావమే అందరిది ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కోరకం. కొంతమందికి శీతాకాలంలోనూ ఫ్యాన్ స్పీడ్‌గా తిరగాలి. మరికొంత మందికి వేడిగా ఉన్నా ప్యాన్ వేసుకోరు. సేమ్ ఇదే ఫార్ములా జంతువులకు వర్తిస్తుంది. అన్ని జంతువుల స్వభావం ఒకేలా ఉండదు. అందుకు ఈ జూలో జంతువుల స్వభావం ఆధారంగా వాటిని స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు జూ సిబ్బంది. దీనిలో భాగంగా ఒరంగుటాన్‌లకు వెచ్చగా ఉంచేందుకు దుప్పట్లు అందించారు అధికారులు. ఒరంగుటాన్ అనేవి ఒక రకమైన కోతుల జాతికి చెందినవి. ఇది ఎక్కువుగా మలేషియా, ఇండోనేషియా ప్రాంతాల్లో ఉంటాయి. కొండచిలువల కోసం దాని చుట్టుపక్కల వరి గడ్డిని అందుబాటులో ఉంచారు. విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రాకు ప్రకాశించే బల్బులను అమర్చారు. ఇగ్వానాలకు కూడా వేడిగా ఉండేందుకు హీటర్లు ఏర్పాటు చేశారు జూ అధికారులు. రాత్రి సమయంలో ఈ సదుపాయాలన్ని జంతువులకు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా జంతువులు శీతాకాలంలో ఆరోగ్య సమస్యల బారిన పడకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందంటున్నారు జూ అధికారులు. చలిగాలుల ప్రబావం జంతువులపై పడకుండా ఉండేలా ఎన్‌క్లోజర్‌లోని ఉష్ణోగ్రత పరిస్థితులను సర్దుబాటు చేశామని జూ అధికారులు తెలిపారు. జంతువులకు ప్రత్యేక ఆహార ఏర్పాట్లు కూడా చేశారు.

పక్షి జాతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఇక్కడి అధికారులు. పక్షులకు చల్లని గాలుల నుండి రక్షణ కల్పించేందుకు ఆగ్రో నెట్ షెడ్లను ఏర్పాటు చేశారు. వినడానికి వింతగా ఉన్నా.. జంతువులు ఆరోగ్య సమస్యల బారినపడకుండా జూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి జంతువులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికి.. వాటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నందన్‌కనన్ జూ అధికారులు తీసుకున్న చర్యలను అందరూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..