అడవికి రారాజు సింహం.. నీటిలో రాజు మాత్రం సింహం కాదు.. ఎందుకంటే అక్కడ రాజ్యం మరొకరిది. నీటిలో మొసలి, ఆ తర్వాత నీటి ఏనుగులదే ఆధిపత్యం. కాదు కూడాదని గీత దాటితే అది రాజైనా.. రారాజైన ఖేల్ కతం. అచ్చు ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో మూడు సింహాలు నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటి ఏనుగు(hippopotamus) ఒక్కసారి దాడి చేసింది. దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు సింహాలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన దక్షిణ ఆఫ్రికా ఖండ దేశం బోట్స్‌వానా (Botswana) లోని సెలిండా రిజర్వ్ లో జరిగింది. గ్రేట్ ప్లెయిన్స్ కన్సర్వేషన్ వారు ఈ ఫుటేజ్‌ని యూట్యూబ్ లోని Latest Sightings వారికి ఇవ్వడంతో వారు అప్‌లోడ్ చేశారు.
బోట్స్‌వానాలోని సెలిండా స్పిల్‌వే (Selinda spillway) ని దాటేందుకు మూడు సింహాలు ప్రయత్నించాయి. ఒక సింహం మాత్రం నీటిలోకి దిగకుండా ఒడ్డునే చూస్తూ ఉండిపోయింది. అయితే ఈ సింహాలు నదిని దాటుతుండగా అందులోనే ఉన్న కొన్ని నీటిఏనుగుల్ని చూశాయి. నీటి ఏనుగులను తప్పించుకుని వేగంగా ప్రయత్నించాయి. అంతలో ఓ రెండు నీటి ఏనుగులు వాటిని చూశాయి. మెరుపు వేగంతో ఈదుతూ సింహాలను టార్గెట్ చేశాయి.
నీటి ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు సింహాలు తలో వైపు వెళ్లాయి. అంతలోనే నీటి ఏనుగు వెళ్లి.. సింహాంపై దాడి చేసింది. ఈ వీడియో జులై 5, 2022న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకూ 31 లక్షల మందికి పైగా చూశారు. 25 వేల మందికి పైగా లైక్ చేశారు.
సింహాలపై నీటి ఏనుగులు దాడి దృశ్యాలు ఇక్కడ చూడండి..