Viral Videos: సలామ్ రా బుడ్డోడా.. ఒలింపిక్స్‌కు వెళితే గోల్డ్ మెడల్ పక్కా.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన సూపర్ వీడియో..

|

Aug 09, 2022 | 2:35 PM

గాల్లో గిర..గిరా తిరుగుతూ.. ప్రపంచ జిమ్నాస్టిక్ క్రీడాకారుడులా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బుడ్డోడు. పట్టుమని పదేళ్లుండవు..అతడు చేసే విన్యాసాలు మాత్రం ఒలింపిక్స్ లో గోల్గ్ మెడల్ వచ్చేదిగా ఉంది. బర్మింగ్ హామ్ వేదికగా కామన్ వెల్త్ గేమ్స్ ముగిసిన తరువాత..

Viral Videos: సలామ్ రా బుడ్డోడా.. ఒలింపిక్స్‌కు వెళితే గోల్డ్ మెడల్ పక్కా.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన సూపర్ వీడియో..
Anand Mahindra
Follow us on

Anand Mahindra Tweet: గాల్లో గిర..గిరా తిరుగుతూ.. ప్రపంచ జిమ్నాస్టిక్ క్రీడాకారుడులా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బుడ్డోడు. పట్టుమని పదేళ్లుండవు..అతడు చేసే విన్యాసాలు మాత్రం ఒలింపిక్స్ లో గోల్గ్ మెడల్ వచ్చేదిగా ఉంది. బర్మింగ్ హామ్ వేదికగా కామన్ వెల్త్ గేమ్స్ ముగిసిన తరువాత.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కు తన స్నేహితుడు పంపించిన ఓ విడీయోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్ర.. తిరునెల్వేలి సమీపంలోని ఓ గ్రామంలో ఓ బాలుడు రోడ్డుపై ఫిల్టీలు కొట్టుకుంటూ..గాల్లో ఎగురుకుంటూ వాడి టాలెంట్ ను బయటపెట్టాడు. దీన్ని చుట్టుపక్కల ఉన్నవారు కెమెరాలో బంధించారు. ఈవీడియో ఆనంద్ మహీంద్ర దృష్టికి రావడంతో ఆబుడ్డోడు వీడియోను షేర్ చేస్తూ.. కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ బంగారు పతకాలు సాధించాక.. భవిష్యత్తు తరం ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు..వారికి మద్దతు లేదు. ఇలాంటి ప్రతిభావంతులందరికీ శిక్షణ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియలో ఈవీడియో చూస్తున్న వారంతా ఓకింత ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఈబుడ్డోడి విన్యాసాలకు నెటిజన్లు సలాం చేస్తున్నారు. ఒలింపిక్స్ కు వెళ్తే గోల్డ్ మెడల్ పక్కా అంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. భారత్ లో టాలెంట్ కు కొదవలేదంటూ ఓ యువకుడు చేస్తున్న అద్భుతమైన వ్యాయామాలను ట్వీట్ చేశాడు. ఈరెండు వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి