Viral Video: ఆనంద్‌ మహీంద్రను ఇంప్రెస్‌ చేసిన వీడియో.. వర్షాకాలంలో ఈ ఐడియా సూపర్‌

|

Jun 24, 2024 | 3:31 PM

ప్రపంచనలుమూలలలో జరిగిన అద్భుత విషయాలను నెటిజన్లతో పంచుకోవడం ఆనంద్‌ మహీంద్రకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యాపార దిగ్గజం పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియోలో జరిగింది ఎక్కడో తెలియకపోయినప్పటికీ, సదరు వ్యక్తి ఐడియా మాత్రం భలే ఉంది. ఇదే విషయాన్ని పంచుకుంటూ ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌...

Viral Video: ఆనంద్‌ మహీంద్రను ఇంప్రెస్‌ చేసిన వీడియో.. వర్షాకాలంలో ఈ ఐడియా సూపర్‌
Viral Video
Follow us on

ఆనంద్‌ మహీంద్రా.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌గా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో నిత్యం సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు, ట్వీట్స్‌ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

ప్రపంచనలుమూలలలో జరిగిన అద్భుత విషయాలను నెటిజన్లతో పంచుకోవడం ఆనంద్‌ మహీంద్రకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యాపార దిగ్గజం పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియోలో జరిగింది ఎక్కడో తెలియకపోయినప్పటికీ, సదరు వ్యక్తి ఐడియా మాత్రం భలే ఉంది. ఇదే విషయాన్ని పంచుకుంటూ ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏమందనేగా..

ప్రస్తుతం వర్షాలు ప్రారంభమ్యాయి. దీంతో ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి అందుకే బయటకు వెళ్లే సమయంలో గొడుగు పట్టుకొని వెళ్తున్నారు. అయితే ఒక రెండు చేతుల్లో ఏవైనా వస్తువులు ఉంటే గొడుగును పట్టుకోవడం అసాధ్యం కదూ. ఈ సమస్యకు పరిష్కారం అన్నట్లుగానే ఓ వ్యక్తి గొడుగును వీపుకు ధరించేలా ఓ సెటప్‌ చేశాడు. ఇందుకోసం మనం బీరువాల్లో చొక్కాలను వేయడానికి ఉపయోగించే రెండు హ్యాంగర్స్‌ను తీసుకున్నాడు.

వైరల్ వీడియో..

ఈ రెండింటి గొడుగు కర్రకు రెండు సైడ్స్‌ పెట్టి ప్లాస్టర్స్‌తో చుట్టేశాడు. ఇంకేముంది రెండు హ్యాంగర్లను రెండు చేతులకు, అచ్చంగా బ్యాక్‌పాక్‌ బ్యాగ్‌ వేసుకున్నట్లు వేసుకున్నాడు. దీంతో అసలు చేతుల అవసరం లేకుండానే ఎంచక్కా వర్షంలో గొడుగుతో బయటకు వెళ్లాడు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది కాస్త ఆనంద్‌ మహీంద్ర దృష్టిలో పడడంతో ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ధరించగలిగే గొడుగుల’ తయారీకి సంబంధించి ఇది ఒక మంచి ఐడియాగా భావించాలి అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..