నీటి కొరతకు వినూత్న ఆలోచన.. ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర

|

Mar 17, 2024 | 6:13 PM

ప్రస్తుతం బెంగళూరులో నీటి ఎద్దడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీటి కొరతకు సంబంధించిన వార్తుల, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలన్న దానిపై చర్చ మొదలైంది. దీంతో నీటిని ఎలా సేవ్‌ చేసుకోవాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఓ వీడియోను..

నీటి కొరతకు వినూత్న ఆలోచన.. ఇంట్రెస్టింగ్‌ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర
Viral Video
Follow us on

మహీంద్రా గ్రూప్స్‌ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్‌ మీడియా గురించి అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పేరు సుపరిచతమే ఉంటుంది. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే అంశాల గురించి స్పందించే ఆనంద్‌ మహీంద్ర తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుతం బెంగళూరులో నీటి ఎద్దడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీటి కొరతకు సంబంధించిన వార్తుల, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలన్న దానిపై చర్చ మొదలైంది. దీంతో నీటిని ఎలా సేవ్‌ చేసుకోవాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఓ వీడియోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముంది.? ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో ఏసీలను వినియోగించడం సర్వసాధారణమైన విషయం. అయితే ఏసీల నుంచి బయటకు వచ్చే నీరు వృథాగా పోతుతుంది. అయితే సరిగ్గా వాడుకోవాలనే కానీ ఈ నీటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చని నిరూపిస్తోంది ఈ వీడియో. ఏసీ యూనిట్ నుంచి బయటకు వచ్చే నీరంతా ఓ పైప్‌లోకి నిండేలా ఏర్పాటు చేశారు. దాని చివరి భాగంలో ఓ చిన్న ట్యాప్ బిగించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘ఇండియాలో ఏసీ ఉపయోగిస్తున్న ప్రతీచోట ఇలాంటి ఏర్పాట్లు కచ్చితంగా చేయాలి. నీరు ఎంతో విలువైంది. దీనిని జాగ్రత్తగా స్టోర్‌ చేయాలి’ అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నీటి కొరతకు చెక్‌ పెట్టేందుకు ఇది కూడా ఒక మంచి ఐడియా అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నీటిని గార్డెనింగ్‌తో పాటు ఇతర వాషింగ్‌ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..