Viral Video: గుంతల రోడ్లకు సింపుల్‌ సొల్యుషన్‌.. మరో సూపర్ వీడియోతో ఔరా అనిపించిన ఆనంద్ మహీంద్ర..

|

Aug 03, 2022 | 2:43 PM

Viral Video: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటారీ బడా బిజినెస్ మ్యాన్. విభిన్నంగా కనిపించే...

Viral Video: గుంతల రోడ్లకు సింపుల్‌ సొల్యుషన్‌.. మరో సూపర్ వీడియోతో ఔరా అనిపించిన ఆనంద్ మహీంద్ర..
Follow us on

Viral Video: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటారీ బడా బిజినెస్ మ్యాన్. విభిన్నంగా కనిపించే ప్రతీ చిన్న అంశాన్ని నెటిజన్లతో పంచుకుంటారు. ఆనంద్‌ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. ఎక్కడో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను షేర్‌ చేసే ఆనంద్‌ మహీంద్ర తాజాగా మరోఆసక్తికరమైన వీడియోను ట్వీట్ చేశారు.

రోడ్డుపై గుంతలు వాహనదారులకు పెద్ద సమస్యనే విషయం తెలిసిందే. అయితే ఈ గుంతలను పూడ్చడానికి మన దగ్గర పెద్దగా సాంకేతికతను ఉపయోగించరు. కంకర మిక్స్‌ను గుంతల్లో నింపుతూ ప్యాచ్‌లు వేస్తుంటారు. అయితే ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియోలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. రోడ్డు రంగులో ఉన్న ఓ షీట్‌ను పరిస్తే చాలు, గుంతలు మాయమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘ఈ ఆవిష్కరణ ఇండియాకు అవసరం. కొన్ని బిల్డింగ్/కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు ఈ టెక్నాలజీని కచ్చితంగా ఉపయోగించాలి. ఈ సంస్థతో సంప్రదించి వెంటనే చర్యలు ఇక్కడ కూడా చేపట్టాలి’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సరికొత్త టెక్నాలజీని చూసిన యూజర్లు భలే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం భారత దేశంలో ఉన్న గుంతల సైజ్‌లను పూడ్చడానికి ఈ టెక్నాలజీ ఏం సరిపోతుంది అంటూ కాస్త వ్యంగ్యంగాను స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..