డబ్బులు ఉన్న వాళ్ల జీవితం బిందాస్‌గా ఉంటుంది. వాళ్లు ఉపయోగించే ప్రతీ వస్తువు ఖరీదైనదేనని అనుకుంటాం. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తే చాలు. పలాన నటుడు ధరించిన టీ షర్టు ధర ఎంతో తెలుసా? పలాన నటి హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా.? అంటూ కథనాలు హోరెత్తుతుంటాయి. సోషల్ మీడియాలోనూ వీటిపై చర్చ జరుగుతుంటుంది. అయితే తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ధరించిన ఓ షర్ట్‌పై నెట్టింట ఇలాంటి చర్చే జరుగుతోంది.
కొన్ని లక్షల కోట్ల ఆస్తికి అధిపతి అయిన జెఫ్ బెజోస్ అంత తక్కువ ధర షర్ట్ ధరించడం ఏంటని నెట్టింట ఓ పెద్ద చర్చ జరగుతోంది. వివరాల్లోకి వెళితే.. బెజోస్ ఇటీవల జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. తన ప్రేయసితో కలిసి ఈవెంట్‌కు హాజరమైన బెజోస్ ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేశాడు. ఈ సందర్భంగా తీసిన కొన్ని వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఫొటోలను చూసిన నెటిజన్లను బెజోష్ షర్ట్ ఆకర్షించింది.
Absolutely love that Bezos went to Coachella and did the same thing I would do – wore a $15 Hawaiian shirt from Amazon.https://t.co/CcQIDK2uGV pic.twitter.com/x8zGzWs5S9
— Sheel Mohnot (@pitdesi) April 24, 2023
బటర్ ఫ్లైస్ ప్రింటింగ్‌తో ఉన్న సదరు షర్ట్ ధరపై నెట్టింట ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. బెజోష్ ధరించిన షర్ట్ అమెజాన్‌లో 12 డాలర్లకు అందుబాటులో ఉందని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే ఆ షర్ట్ విలువ కేవలం రూ. 980 మాత్రమే. ఇంకేముంది ఈ పోస్ట్ కాస్త శరవేగంగా నెట్టింట ట్రెండ్ అవుతోంది. అన్ని లక్షల కోట్ల ఆస్తులున్న వ్యక్తి సింప్లిసిటీ భలే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Kendall Jenner, Kris Jenner and Jeff Bezos during the second weekend of the Coachella Valley Music & Arts Festival. pic.twitter.com/OaX7ZjgkJz
— @21metgala (@21metgala) April 22, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..