Viral Video: సూపర్ ఉమెన్.. నీటిపై అద్భుతమైన స్టంట్లు చేసిన మహిళ.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే..

చాలామంది భూమిపై రకరకాల విన్యాసాలు చేయడం మీరు తప్పక చూసుంటారు.. కానీ నీటిపై ఎవరైనా ఫీట్లు చేయడాన్ని మీరు చూశారా?

Viral Video: సూపర్ ఉమెన్.. నీటిపై అద్భుతమైన స్టంట్లు చేసిన మహిళ.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే..
Viral News

Updated on: May 15, 2022 | 9:02 AM

Amazing stunt on water by a woman: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళ నీటిపై చేసిన స్టంట్ వైరల్‌గా మారింది. సాధారణంగా చాలామంది అద్భుతమైన ఫీట్‌లు చేస్తూ కనిపిస్తుంటారు. ఈ విన్యాసాలు చూస్తుంటే చాలా డేంజర్‌గా కనిపిస్తాయి. ఇంత డేంజరస్ స్టంట్స్‌ని భయం లేకుండా ఎలా చేస్తున్నారో అంటూ మన మనసులో అనిపిస్తుంటుంది. ప్రమాదకరమైన విన్యాసాలు.. కఠోర సాధన తర్వాతే చేస్తుంటారు. అయితే.. చాలామంది భూమిపై రకరకాల విన్యాసాలు చేయడం మీరు తప్పక చూసుంటారు.. కానీ నీటిపై ఎవరైనా ఫీట్లు చేయడాన్ని మీరు చూశారా? అవును, ఇలాంటి వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియా (social media) లో బాగా వైరల్ అవుతోంది.. అందులో ఒక మహిళ నీటిపై అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కనిపించింది.

వైరల్ వీడియోలో.. స్విమ్మింగ్ పూల్ నీటిలో పెద్ద సర్ఫింగ్ బోర్డు దాని మధ్యలో ఇనుప రాడ్ ఉంటుంది. ఆ రాడ్ సహాయంతో ఓ మహిళ తన చేతులను ఉంచి తలకిందులుగా నిలబడి సంట్లు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో.. ఆమె తన చేతులను స్థిరంగా ఉంచింది.. కానీ ఆమె పాదాలు గాలిలో ఉంచి.. ఫీట్‌లను చేస్తుంది. అయితే.. ఇలాంటి ఫిట్లను అరుదుగా చూస్తున్నామంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

వీడియో చూడండి..

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌హాగ్ యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 17 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది లైక్ చేసారు. అదే సమయంలో.. నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈమెను ‘ఫ్లెక్సిబుల్’ అని అభివర్ణించగా.. మరికొందరు సూపర్ ఉమెన్ అంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Rice Water for Hair: బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా.. అందులోని పోషకాలు తెలిస్తే అస్సలు ఒదిలిపెట్టరు..

High BP Control Tips: మందులు లేకుండానే హైబీపీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి.. సింపుల్ టిప్స్ మీకోసమే..