విమానం టేకాఫ్‌ సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ ఓపెన్ చేస్తే ఏమౌతుందో చూద్దామనుకున్నాడు..కట్‌ చేస్తే..

విమానం రన్‌వే వైపు దూసుకుపోతుండగా జౌన్‌పూర్ జిల్లాకు చెందిన సుజిత్ సింగ్ అనే ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన క్యాబిన్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు ఆసక్తికర విషయాలను చెప్పినట్టుగా అధికారులు వెల్లడించారు.

విమానం టేకాఫ్‌ సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ ఓపెన్ చేస్తే ఏమౌతుందో చూద్దామనుకున్నాడు..కట్‌ చేస్తే..
Akasa Air Emergency Exit Incident

Updated on: Nov 04, 2025 | 4:53 PM

వారణాసి నుంచి ముంబై వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. సోమవారం సాయంత్రం విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. సోమవారం సాయంత్రం 6:45 గంటలకు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి బయలుదేరాల్సిన QP 1497 విమానంలో ఈ సంఘటన జరిగింది. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకుని, అధికారులకు సమాచారం అందించారు.

విమానం రన్‌వే వైపు దూసుకుపోతుండగా జౌన్‌పూర్ జిల్లాకు చెందిన సుజిత్ సింగ్ అనే ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన క్యాబిన్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కేవలం ఆసక్తితోనే డోర్ తెరిచేందుకు ప్రయత్నించానని సుజిత్ చెప్పినట్లు సమాచారం. అతనిపై కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు.

సుజిత్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. భద్రతా అనుమతి తర్వాత విమానం రాత్రి 7.45 గంటలకు ముంబైకి బయలుదేరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..