Viral Video: కస్టమర్ కి ఆర్డర్ డెలివరీ చేయమంటే.. సగం ఫుడ్ తినేసిండు..!

అహ్మదాబాద్‌ లో ఫుడ్ డెలివరీ చేసే ఉద్యోగి కస్టమర్ ఆర్డర్‌ లోని ఆహారాన్ని తినడం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ లో వైరల్ గా మారింది. జూన్ 20న రాత్రి 10:50 గంటల సమయంలో అహ్మదాబాద్‌ లోని ఓ అపార్ట్‌ మెంట్‌ లో ఈ ఘటన జరిగింది. శ్రీతై సూపర్‌ వేర్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలా రాజన్ ఈ వీడియోను లింక్డ్‌ఇన్‌లో షేర్ చేయడంతో ఈ విషయం మరింత వెలుగులోకి వచ్చింది.

Viral Video: కస్టమర్ కి ఆర్డర్ డెలివరీ చేయమంటే.. సగం ఫుడ్ తినేసిండు..!
Delivery Boy Eating Food

Edited By: TV9 Telugu

Updated on: Jun 24, 2025 | 1:18 PM

వీడియోలో కనిపించిన ఫుడ్ డెలివరీ వ్యక్తి అపార్ట్‌ మెంట్ ఎలివేటర్‌ లోకి ప్రవేశించి కొన్ని ఫ్లోర్ బటన్లను నొక్కాడు. ఎలివేటర్ ఒక ఫ్లోర్ వద్ద ఆగిన తర్వాత అతను కస్టమర్ ఆర్డర్‌ ను తెరిచి అందులోని కొంత ఆహారాన్ని తిన్నాడు. ఆ తరువాత మళ్లీ అదే ప్యాకింగ్‌ లో ఆహారాన్ని పెట్టి డెలివరీ కొనసాగించాడు.

బాలా రాజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పని కాదు. ఇది నైతికత, సరైన వేతనాలు, ఉద్యోగ గౌరవం వంటి పెద్ద సమస్యలకు సూచన. ఎవరైనా ఆకలితో ఇలా దొంగతనం చేయాల్సి వస్తే.. ఎక్కడో వ్యవస్థలో లోపం ఉన్నట్లే. అసలు సమస్య ఏమిటి..? అతని ఆలోచనా..? లేక తక్కువ జీతమా..? డెలివరీ సంస్థలు నిజంగా మనుషులు బ్రతికేందుకు సరిపడా జీతాలు ఇస్తున్నాయా..? ఈ బాధ్యత ఎవరిది.. ఆ వ్యక్తిదా, సంస్థదా, లేక మొత్తం వ్యవస్థదా..?

ఈ వీడియో వైరల్ కావడంతో లక్షలాది మంది ఆలోచనలో పడ్డారు. పని చేసే సంస్థలు తమ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదా..? ఉద్యోగ గౌరవం లభిస్తుందా..? అన్న ప్రశ్నలు తలెత్తాయి. డబ్బు చెల్లించి ఆహారం కొనుక్కునే కస్టమర్‌ కు ఇది న్యాయమా? అనే సందేహాలు కూడా మిగిలాయి.

ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలా మంది ఆలోచనలో పడ్డారు. దీని వల్ల కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. పని చేసే సంస్థలు తమ ఉద్యోగులకు సరైన వేతనాలు చెల్లిస్తున్నాయా.. లేదా..? ఉద్యోగులకు తగిన గౌరవం లభిస్తుందా..? డబ్బు చెల్లించి ఆహారం కొనుక్కునే కస్టమర్‌ కు ఇది న్యాయమేనా..?

ఈ సంఘటన ఫుడ్ డెలివరీ రంగంలోని లోపాలను, ఉద్యోగుల సంక్షేమాన్ని, కస్టమర్ల హక్కులను మరోసారి చర్చకు తెచ్చింది. వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందో.. దీనికి ఎవరు బాధ్యత వహించాలో అన్న ప్రశ్నలు మిగిలాయి.