Viral News: ఆ కుక్క మాదే.. ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్.. వైరల్‌గా మారిన యువతి పోస్ట్!

ఇటీవల ఒక కుక్క ఎలుకను వేటాడుతూ.. కారు బంపర్‌ను పీకేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం అందిరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఈ ఘటన సంబంధించిన మరో పోస్ట్‌ ట్రింగ్‌లోకి వచ్చింది. ఆ వీడియో కనిపిస్తున్న కుక్క తమదేనని.. అది ఎక్కడైన కనిప్తే సమాచారం ఇవ్వండని ఒక మహిళ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది కూడా ఇప్పుడు ట్రిండింగ్‌లోకి వచ్చింది.

Viral News: ఆ కుక్క మాదే.. ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్.. వైరల్‌గా మారిన యువతి పోస్ట్!
Viral News

Updated on: Nov 27, 2025 | 10:48 AM

ఇటీవల ఒక కుక్క ఎలుకను వేటాడుతూ.. కారు బంపర్‌ను పీకేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కుక్కను నుంచి తప్పించుకునేందుకు ఒక ఎలుక ఖాళీ ప్లేస్‌లో పార్క్‌చేసి ఉన్న ఒక కార్‌లోకి దూరుతుంది. అది గమనించిన కుక్క.. ఆ కారు దగ్గరకు వచ్చి.. దాని పదునైన పళ్లతో కారు బంపర్‌ను మొత్తం పీకేస్తుంది. తర్వాత ఎలుక కిందపడడంతో.. దాన్ని నోట కర్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన తర్వాత తాజాగా ఈ ఘటన సంబంధించిన మరో పోస్ట్‌ ట్రింగ్‌లోకి వచ్చింది. ఆ వీడియో కనిపిస్తున్న కుక్క తమదేనని.. అది ఎక్కడైన కనిప్తే సమాచారం ఇవ్వండని ఒక గోవాకు చెందిన ఒక మహిళ ఆపోస్ట్‌లో పేర్కొంది. వైరల్‌ పోస్ట్ ప్రకారం.. అది మా పెంపుడు కుక్క దాని పేరు.. చీకు.. అది చాలా రోజుల క్రితం తప్పిపోయిందని ఆమె పేర్కొంది.

గోవా నివేదించిన ప్రకారం.. జనవరి 2025లో చికు మాపుసాలోని షెట్యే వాడో నుండి తప్పిపోయిందట. దాని కోసం ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ దొరకలేదట.. అయితే తాజాగా ఆ కుక్క కారులో ఎలుకను వేటాడుతున్న వీడియో వైరల్‌ కావడంతో యజమాని శ్రద్ధ తన కుక్కను గుర్తించిందట. వీడియోలో కనిపించిన దాని ప్రవర్తన, ముఖ కవళికల ద్వారానే తాను దానిని గుర్తించాట్టు ఆమె చెప్పుకొచ్చింది.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.