నెమలిపై ఫిర్యాదు చేసిన మహిళ..! చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల డిమాండ్‌.. కారణం ఏంటంటే..

|

Jul 03, 2023 | 7:37 AM

అడవులు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నెమళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి పరుగులు తీస్తున్నాయి. రైతులు వేసిన పంటలు, చిన్న చిన్న కీటకాలను తిని బతుకుతూ తమ మనోహరమైన చేష్టలతో నృత్యాలు చేస్తూ

నెమలిపై ఫిర్యాదు చేసిన మహిళ..! చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల డిమాండ్‌.. కారణం ఏంటంటే..
Peacock
Follow us on

నెమలి.. మన జాతీయ పక్షి.. చాలా పొడవైన, అందమైన రంగురంగుల తోకతో అందాల హరివిల్లు లాంటిది మయూరం. తన తోకను విసనకర్ర మాదిరి పూర్తిగా తెరిచి, నాట్యం చేస్తుంటే నెమలి రాజసం చూసేందుకు రెండు కళ్లు కూడా సరిపోవని చెప్పాలి. జాతీయ పక్షి హోదాకు తగినట్లుగానే కనిపిస్తుంది. దేశంలో నెమళ్ల సంరక్షణకు కఠిన చట్టాలు అమలులోకి రావడంతో నేడు నెమళ్ల సంఖ్య రెట్టింపు అయింది. అడవులు, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నెమళ్లు ఇప్పుడు జనావాసాల్లోకి పరుగులు తీస్తున్నాయి. రైతులు వేసిన పంటలు, చిన్న చిన్న కీటకాలను తిని బతుకుతూ తమ మనోహరమైన చేష్టలతో నృత్యాలు చేస్తూ ప్రజలను అలరిస్తాయి. అలాంటికి సంబంధించి ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. నెమలి తనపై దాడి చేసిందంటూ ఓ మహిళ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం చన్నపట్నం తాలూకాలో ఓ మహిళ నెమలిపై అటవీశాఖకు ఫిర్యాదు చేసిన అరుదైన ఘటన చన్నపట్నం తాలూకాలో చర్చనీయాంశమైంది. ఇక్కడి ఒక గ్రామానికి చెందిన లింగమ్మ అనే మహిళ ఫారెస్ట్ కన్జర్వేటర్ కార్యాలయానికి వెళ్లి నెమలిపై రాతపూర్వకంగా జూన్ 28న ఫిర్యాదు చేసింది. నెమలిపై అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరు గ్రామస్తులు ఈ ఫిర్యాదుపై సంతకం కూడా చేశారు. అసలు ఫిర్యాదు ఏంటంటే..

తామంతా రైతులమని, తమ ఇంటి సమీపంలో గత నాలుగైదు రోజులుగా ఒక నెమలి వచ్చి ఇక్కడే నివసిస్తోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 26న తమ ఇంటి వెనుక పని చేస్తున్న తనపై అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని మహిళ రైతు ఫిర్యాదు చేసింది. సాయంత్రం సమయంలో జరిగిన ఈ ఘటనతో గాయపడిన మహిళను స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ మరుసటి రోజు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నెమలి దాడితో బాధిత మహిళ తీవ్రంగా గాయపడిందని ఆరోపిస్తూ..నెమలిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు, గ్రామస్తులు కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..