Trending Video: లైక్ ల కోసం ఇంత కక్కుర్తి అవసరమా.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. వీడియో చూసేయండి..

దెయ్యాలు, భూతాలు ఉన్నాయా.. ఇది అంతుచిక్కని ప్రశ్న. కొందరు ఉన్నాయని వాదిస్తే.. మరికొందరు మాత్రం లేవని కొట్టిపారేస్తుంటారు. విషయం ఎలా ఉన్నా.. దెయ్యాలంటే అందరికీ భయమే. ముఖ్యంగా..

Trending Video: లైక్ ల కోసం ఇంత కక్కుర్తి అవసరమా.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. వీడియో చూసేయండి..
Funny Frank Video

Updated on: Feb 20, 2023 | 8:36 AM

దెయ్యాలు, భూతాలు ఉన్నాయా.. ఇది అంతుచిక్కని ప్రశ్న. కొందరు ఉన్నాయని వాదిస్తే.. మరికొందరు మాత్రం లేవని కొట్టిపారేస్తుంటారు. విషయం ఎలా ఉన్నా.. దెయ్యాలంటే అందరికీ భయమే. ముఖ్యంగా చీకటిలో ఒంటరిగా వెళ్లేందుకు భయపడేవారూ లేకపోలేదు. అనుకోని పరిస్థితుల్లో అర్థరాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించాలంటే.. కాస్త భయంగానే ఉంటుంది. కాస్త ధైర్యం చేసుకుని వేగంగా గమ్యానికి చేరుకునేందుకు ట్రై చేస్తుంటారు. అయితే.. ఈ మధ్య కొంతమంది యువకులు చేస్తున్న చేష్ఠలు రోత పుట్టిస్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్‌ వినియోగంతో యువతకు ఆకాశమే హద్దుగా మారింది. ఇక సోషల్‌ మీడియాలో లైక్స్‌ కోసం, రకరకాల స్టంట్లు, ప్రాంక్స్‌ చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఇతరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కూడా. తాజాగా కొందరు యువకులు చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఇంతకీ ఏం చేశారంటే…

రోడ్డుపై ఓ యువకుడు బైక్‌పైన ఒంటరిగా వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి రోడ్డు మధ్యలో ఓ తెల్లని ఆకారం కనిపించింది. తెల్లని వస్త్రాలు ధరించి రోడ్డు మధ్యలో కూర్చుని ఉంది ఆ ఆకారం. దూరం నుంచే దానిని గమనించిన యువకుడు ఒకింత భయపడుతూనే దగ్గరకు వెళ్లాడు. ఆ ఆకారం అక్కడినుంచి కదలలేదు. అనుమానం వచ్చిన ఆ యువకుడు ధైర్యం చేసి దగ్గరగా వెళ్లి పరిశీలించాడు. అంతే వెంటనే ఆ ఆకారాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలు పెట్టాడు. ఇంతలో దూరం నుంచి మరో నాలుగు ఆకారాలు వచ్చాయి. దెబ్బలు తింటున్న తమ స్నేహితుడ్ని బైకర్‌ బారినుంచి కాపాడుకోడానికి అతనిపై తిరగబడ్డారు. ఇంతకీ వాళ్లంతా ప్రాంక్‌ వీడియో తీస్తున్న యువకులు.

ఇవి కూడా చదవండి

దెయ్యం రోడ్డు మధ్యలో కూర్చున్నట్లు బిల్డప్‌ ఇచ్చి జనాలను భయపెట్టాలనుకున్నారు. బైకర్‌ ధైర్యవంతుడు కావడంతో వీరి ప్లాన్‌ బెడిసికొట్టింది. అతని చేతిలో బడితెపూజ జరిగింది. దాంతో అసలు విషయం బైకర్‌ చెప్పి సారీ చెప్పారు. దాంతో బైక్‌ రైడర్‌ కూడా శాంతించి వాళ్లను క్షమించారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 31 వేలమందికి పైగా వీక్షించారు. వెయ్యిమందికి పైగా లైక్‌ చేశారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. బైకర్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అలాంటి వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటూ మరో యూజర్‌ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..