మన సంప్రదాయ దుస్తులలో లుంగీ ఒకటి. నేటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు ఇంటి వద్ద ఉన్నప్పుడు, ఊళ్లు పనుల మీద వెళ్లేందుకు లుంగీ కట్టుకుంటారు. ఇప్పుడు మన సంస్కృతి ప్రకారం పండుగలు, వివాహ కార్యక్రమాలు లేదా దేవాలయాలను సందర్శించే సమయంలో నగర కుర్రాళ్ళు కూడా తెల్లటి పట్టు పంచె ధరిస్తారు. అలానే ఓ యువతి లుంగీ కట్టుకుని హల్చల్ చేసింది. మగవాళ్ల కంటే నేనేం తక్కువ కాదు.. అన్నట్టుగా సదరు యువతి లండన్ వీధుల్లో రజనీకాంత్ స్టైల్లో హంగామా సృష్టించింది.
లుంగీపై టీ షర్ట్ వేసి కళ్లజోడు పెట్టుకుని లండన్ వీధుల్లో తిరుగుతున్న ఓ యువతి వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఆమె లుంగీ అవతార్‌పై విదేశీయులు ఎలా స్పందించారో చూడండి.
ఇంగ్లండ్ ప్రజల స్పందనను చూసేందుకు కంటెంట్ సృష్టికర్త వావేరి అనే యువతి లుంగీ కట్టుకుని లండన్ వీధుల్లో నడిచింది. ఆమె ఈ వీడియోను తన (@valerydaania) Instagram ఖాతాలో పోస్ట్ చేసింది. వైరల్ వీడియోలో వాలెరీ లుంగీతో లండన్ వీధుల్లో నడుస్తూ ఒక దుకాణంలోకి కూడా వెళ్తుంది. అక్కడ పనిచేసే వ్యక్తి ఆమె ప్రత్యేకమైన దుస్తులపై చాలా ఆసక్తి చూపించాడు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఆమె డ్రెసింగ్ స్టైల్ చూసి ఎలా స్పందిస్తారో కూడా వీడియోలో చూపిస్తుంది. ఈ డ్రెస్ చూసిన విదేశీయులు ఆమె లుంగీ ఫ్యాషన్ చూసి కంగారు పడ్డారు.
మే 12న షేర్ చేసిన ఈ వీడియోకు 1.1 మిలియన్ల వీక్షణలు రావడంతో యువతి కొత్త ట్రెండ్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. భారతీయ సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తున్నందుకు ఆమెను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి