ఇంటర్నెట్ (Internet) లో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని చూసేందుకే కాకుండా ఇతరులతో పంచుకునేందుకూ నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జంతువులు లేదా పక్షులు చేసే పనులు ఆశ్చర్యంతో పాటు నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. కాకి చాలా తెలివైన పక్షి అని మనకు తెలిసిందే. రెప్పపాటు కాలంలో ఆహారాన్ని దొంగిలించడంలో వాటిని మించింది ఏదీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాకికి సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూశాక కాకి కంటే తెలివైన పక్షి లేదని మీరు కచ్చితంగా అంగీకరిస్తారు. ఈ క్లిప్ లో రెండు కాకులు ఒక జట్టుగా ఏర్పడి పిల్లిపై దాడి చేస్తాయి. అంతే కాదండోయ్.. పిల్లి దాచుకున్న ఆహారాన్ని దోచుకుని ఎగిరిపోతాయి. దీని కోసం ఓ కాకి పిల్లిని వెనుక నుంచి ముక్కుతో పొడుస్తుంది. పిల్లి దానిపై దాడి చేయడానికి పరిగెత్తిన వెంటనే మరొక కాకి పిల్లి ఆహారాన్ని తీసుకుని ఎగిరిపోతుంది. ఈ రెండు కాకులు తమ ప్లాన్ తో ఆహారాన్ని తెలివిగా సంపాదించాయి.
الغربان من أذكى الحيوانات، لاحظوا كيف خططوا وسرقوا الطعام من القط! ??? pic.twitter.com/QiVQ5NCY7k
ఇవి కూడా చదవండి— مملكه الحيوان (@88if13) August 24, 2022
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 91 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1500 కంటే ఎక్కువ లైక్‌లు వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ‘నిజంగా మనం టీమ్ వర్క్‌లో కొంత పని చేస్తే, కచ్చితంగా విజయం సాధిస్తాం’, ‘నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను కాకిని తెలివైన పక్షి ఎందుకు అంటారో’, టీమ్ వర్క్ మంచి ఫలితాన్ని ఇస్తుందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్లిప్ ను చూసేందుకే కాకుండా స్నేహితులకు, బంధువులకు షేర్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..