Trending Video: ఆ పని చేస్తేనే జయమాల వేస్తానన్న వరుడు.. క్యూట్ రొమాంటిక్ వీడియో మీ కోసం..

|

Jan 23, 2023 | 9:59 AM

పెళ్లనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునేది. అలాంటి పెళ్లి స్పెషల్ గా నిలిచిపోవాలనుకుంటోది నేటి జనరేషన్. దీని కోసం రోటీన్ గా కాకుండా వెరైటీ పనులు చేస్తున్నాయి. పెళ్లి చూపులు నుంచి అప్పగింతల వరకు వివాహంలోని...

Trending Video: ఆ పని చేస్తేనే జయమాల వేస్తానన్న వరుడు.. క్యూట్ రొమాంటిక్ వీడియో మీ కోసం..
Bride Kissing Groom
Follow us on

పెళ్లనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునేది. అలాంటి పెళ్లి స్పెషల్ గా నిలిచిపోవాలనుకుంటోది నేటి జనరేషన్. దీని కోసం రోటీన్ గా కాకుండా వెరైటీ పనులు చేస్తున్నాయి. పెళ్లి చూపులు నుంచి అప్పగింతల వరకు వివాహంలోని అన్ని ఘట్టాలు స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. శుభలేఖలు, విందు, బరాత్ వంటి వాటిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడానికి కారణం ఇదే. కొన్నిసార్లు వైరల్ అయ్యే కొన్ని వివాహ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అవి జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం జయమాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

కోరుకున్నది దక్కించుకోవడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. చివరికి దాన్ని దక్కించుకుంటాం. ఇక ప్రేమించిన వారి విషయంలో ఊరుకుంటామా. పెద్దలను ఒప్పించైనా సరే.. సొంతం చేసుకుంటాం. అందుకే ప్రేమకు చాలా శక్తి ఉంటుందని చెబుతుంటారు. మనసుకు నచ్చిన వారు.. జీవితాంతం కలిసి ఉంటారనే నమ్మకం వచ్చి.. వివాహం చేసుకున్నప్పుడు కలిగే ఫీలింగే వేరు. అనుభవిస్తే గానీ ఆ మాధుర్యం ఏమిటో అర్థం కాదు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు జయమాలను మార్చుకోవడాన్ని చూడవచ్చు. ఇంతలో పెళ్లికొడుకు ముద్దు ఇస్తేనే మాల వేస్తానని సైగతో చెప్పాడు. అయితే.. వరుడు ఇలాంటి కోరిక కోరుతాడని ఊహించని వధువు షాక్ అయ్యింది. వరుడు తన నుంచి ఇంత డిమాండ్ చేస్తాడని వధువు ఊహించి ఉండదు. ఆ సమయంలో వధువు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కాసేపటి తర్వాత చాలా రొమాంటిక్ గా అందరి ముందు వరుడిని ముద్దు పెట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..