Viral News: పురుగు కుట్టడడంతో అరుదైన వ్యాధి.. చికిత్స కోసం రూ.52 లక్షలు ఖర్చు.. కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వ్యక్తి..

|

Jul 25, 2023 | 9:09 AM

టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తిని ఒక చిన్న పురుగు కరిచింది. అయితే అతని జీవితంలో ఈ పురుగు పెను ప్రమాదాన్ని సృష్టించింది. ఈ కీటకం కారణంగా ఆ వ్యక్తి మరణం అంచు వరకూ వెళ్లి వచ్చాడు. అయితే కీటకం కరవడం వలన వచ్చిన తీవ్రమైన వ్యాధితో ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్సలో భాగంగా బాధితుడి చేతులు, కాళ్ళను కట్ చేయాల్సి వచ్చింది.   

Viral News: పురుగు కుట్టడడంతో అరుదైన వ్యాధి.. చికిత్స కోసం రూ.52 లక్షలు ఖర్చు.. కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వ్యక్తి..
Texas Man
Follow us on

ప్రకృతిలో రకరకాల కీటకాలు, పురుగులు, పక్షులు, జంతువులు కనిపిస్తూనే ఉంటాయి. వాటిల్లో కొని మానవులకు హానికరం. కొన్ని రకాల కీటకాలు కరిచినట్లయితే అవి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది కూడా.. అయితే ఇలా ఆస్పత్రిపాలు చేసే కీటకాలు.. సర్వ సాధారణంగా అటవీ ప్రాంతంలో మాత్రమే దర్శనమిస్తాయి. అయితే ఇలాంటి కీటకాలు అడవులను వదిలి ఒకొక్కసారి మానవ నివాసాల్లో కూడా దర్శనమిస్తాయి. తరువాత వ్యాధులను వ్యాప్తి చేయడం ప్రారంభిస్తాయి. అయితే ఈ పురుగులు కరిచినప్పుడు ప్రాణాలు ప్రమాదంలో పడడం అరుదుగా అయినా సరే.. తరచుగా ఇటువంటి సంఘటలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకుంటే.. ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం.

టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తిని ఒక చిన్న పురుగు కరిచింది. అయితే అతని జీవితంలో ఈ పురుగు పెను ప్రమాదాన్ని సృష్టించింది. ఈ కీటకం కారణంగా ఆ వ్యక్తి మరణం అంచు వరకూ వెళ్లి వచ్చాడు. అయితే కీటకం కరవడం వలన వచ్చిన తీవ్రమైన వ్యాధితో ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్సలో భాగంగా బాధితుడి చేతులు, కాళ్ళను కట్ చేయాల్సి వచ్చింది.

వైద్యం కోసం లక్షలను ఖర్చు చేస్తున్నారు
బాధిత వ్యక్తి పేరు మైఖేల్ కోల్‌హాఫ్. మీడియా నివేదికల ప్రకారం మైఖేల్..   టైఫస్ అనే వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ఒక చిన్న పరాన్నజీవి పురుగు కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధి వలన వచ్చే సమస్య ఏమిటంటే.. ఈ వ్యాధి సోకినవారికి నయం కాదు.. అంతేకాదు నివారణ కోసం చికిత్స కోసం లక్షలు,  కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నప్పటికీ, శతాబ్దాల క్రితం టైఫస్ వ్యాధికి చికిత్స లేదు. 1812లో చాలా మంది ఫ్రెంచి సైనికులు టైఫస్ వ్యాధి బారిన పడ్డారని.. ఆ సమయంలో చికిత్స లేకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ చేసి చేతులు, కాళ్లు తీసివేత..
నివేదికల ప్రకారం సెప్టిక్ షాక్ కారణంగా మైఖేల్ ఆసుపత్రిలో చేరాడు. చాలా రోజులు చికిత్స తీసుకున్నాడు.  వైద్యులు మందులు ఇచ్చారు. అయినప్పటికీ అతని చేతులు, కాళ్లు ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో  వైద్యులు ఆపరేషన్ చేసి చేతులు, కాళ్ళు కట్ చేశారు. తద్వారా అతని ప్రాణాలను కాపాడగలిగారు. ఇప్పటి వరకూ మైఖేల్ చికిత్స కోసం దాదాపు 52 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మైఖేల్ వైద్యం చేయించడానికి అతని కుటుంబం వద్ద అంత డబ్బు లేకపోవడంతో.. ఫండింగ్ ద్వారా అంత డబ్బు సేకరించి, మైఖేల్‌కు వైద్యం చేయించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..