లాక్‌డౌన్ కారణంగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతీ రోజూ అనేక ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న సమాచారం కొంత ఆనందాన్ని పంచుతుంటే.. మరికొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచ నలుమూలల ఏ వింత జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమివ్వాల్సిందే.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. ఆ ఫోటోలో ఏ జంతువు ఉంది.? ఎక్కడ ఉంది.? అని గుర్తించడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో నెటిజన్ల మెదడుకు మేత పెడుతోంది. ఎక్కడో అడవి ప్రాంతంలో రాళ్లు, కొండలు ఉన్నాయి. ఆ ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇందులో చిరుత ఉంది గుర్తించండి అని నెటిజన్లకు పజిల్ విసిరాడు. ఆ ఫోటోను చూసినవారు అందులో చిరుత ఎక్కడుందా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై లుక్కేయండి.
ఈ ఫోటోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అభినవ్ గుప్తా తీశారు. జైపూర్ అరవలి హిల్స్‌కు ట్రెకింగ్‌కు వెళ్లిన అతడు.. ఈ ఫోటోను తీశాడు. ఇంటికి చేరుకునేవరకు అందులో ఓ చిరుత దాగుందని అతడికి తెలియలేదు. మొదటిసారి అతడికి ఈ ఫోటో చూసిన తర్వాత అందులో చిరుత ఉందని గుర్తించలేకపోయాడు. తీక్షణంగా చూస్తే ఓ మూలన చిరుత సేద తీరుతున్నట్లు కనిపెట్టాడు. మీరు దాన్ని గుర్తించలేకపోయరా.? అయితే క్రింద ఫోటోలో సమాధానం ఉంది… చూడండి.!
పైన పేర్కొన్న ఫోటోలో రెడ్ సర్కిల్‌తో చుట్టిన ప్రదేశంలో చిరుత సేద తీరుతోంది. ఈ ఫోటోలోని ప్రదేశం పశ్చిమ భారతదేశంలోని జైపూర్ అరవలి హిల్స్. ఈ జూమ్ చేసిన ఫోటో చూడండి.. మీకు చిరుత కనిపిస్తుంది.