Viral Video: దూసుకుపోతున్న వాహనం.. అంతలోనే అనుకోని అతిథి ఎంట్రీ.. షాకైన డ్రైవర్‌..

|

Apr 25, 2022 | 2:52 PM

Viral Video: వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ లేని పాములు బయటకు వస్తుంటాయి. చలికాలంలో కన్నాల్లో దాక్కున్న పాములు వేసవి వచ్చిందంటే వేడిని తట్టుకోలేవు. దీంతో ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి. వచ్చినవి వచ్చినట్లు ఉండకుండా జనావాసాల్లోకి వచ్చేస్తాయి...

Viral Video: దూసుకుపోతున్న వాహనం.. అంతలోనే అనుకోని అతిథి ఎంట్రీ.. షాకైన డ్రైవర్‌..
Follow us on

Viral Video: వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ లేని పాములు బయటకు వస్తుంటాయి. చలికాలంలో కన్నాల్లో దాక్కున్న పాములు వేసవి వచ్చిందంటే వేడిని తట్టుకోలేవు. దీంతో ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి. వచ్చినవి వచ్చినట్లు ఉండకుండా జనావాసాల్లోకి వచ్చేస్తాయి. చల్లగా ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి వస్తున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో పాములు బైక్‌లు, కార్లలో దూరి తలదాచుకుంటున్నాయి. ఒకప్పుడు ఇలాంటి విషయాలు కేవలం పాములను చూసిన వారికి మాత్రమే తెలిసేవి. కానీ ఏమంటూ సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిందో, పాములకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

రోజుకో వీడియో నెట్టింట సందడి చేస్తూ నెటిజన్లను షాక్‌కి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇంగ్లండ్‌లోని స్టోఫోర్డ్‌షైర్‌లో ఓ వ్యక్తి తన వ్యాన్‌లో హైవేపై దూసుకుపోతున్నాడు. హాయిగా రైడ్ చేస్తూ వెళుతోన్న సదరు కారు యజమానికి సెడన్‌గా ఓ అనుకొని అతిథి దర్శనమిచ్చింది. కారు ముందు బానెట్‌లో నుంచి ఓ పాము మెల్లిగా బయటకు వచ్చింది. వచ్చిన ఆ పాము నెమ్మదిగా సైడ్‌ మిర్రర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. కాసేపటి తర్వాత పట్టు తప్పడంతో రోడ్డు మీద పడిపోయింది.

అయితే ఆ డ్రైవర్‌ మాత్రం వాహనాన్ని ఆపకుండా తన స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశాడు. రోడ్డుపై పడ్డ తర్వాత పాముకు ఏమైందన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘వీడియో తీయడం మానేసి, కారు ఆపి పామును పంపేసి ఉంటే పాముకు ఏమయ్యేది కాదుగా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

Also Read: Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటున్నారా..? ఐ20 రూ.5 లక్షల లోపే.. పూర్తి వివరాలు..!

AP News: తాడేపల్లిలో హై టెన్షన్.. ముట్టడి కట్టడి చేస్తూ నిర్బంధాలు, అరెస్ట్‌లు..(Video)

మంచిగా నిద్రపోవాలనుకుంటున్నారా..? జస్ట్ ఈ యోగాసనాలు వేయండి..