Pengwin: బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందులోనూ, చిన్నారిగా ఉన్న బిడ్డ పోతే ఆ బిడ్డ తల్లిదండ్రులను ఎవరూ ఒదార్చలేరు. ఈ ఎమోషన్ మనుషుల్లోనే అని మనం అనుకుంటాం. కానీ, జంతువులు, పక్షుల్లోనూ చాలా ఉంటుంది. మనం గమనించం అంతే. ఒక్కోసారి మన దగ్గరలో ఏదైనా సంఘటన ఇటువంటిది జరిగితే కూడా పెద్దగా మనకు అర్ధం కాదు. కానీ, ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియో చూస్తె మీ మనసు ద్రవించిపోవడం ఖాయం.
పెంగ్విన్ గురించి అందరికీ తెలిసిందే. అంటార్కిటికా మంచు ప్రాంతాల్లో ఉంటాయి. వీటి ప్రవర్తన అచ్చు మనుషుల్లానే ఉంటుంది. వీటిలో కూడా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు చెందిన సుశాంత్ నందా సోమవారం ఒక వీడియో ఈ పెంగ్విన్ లకు సంబంధించింది షేర్ చేశారు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడి పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఒక చిన్న పెంగ్విన్ ఎలా చనిపోయిందో తెలీదు చనిపోయి ఉంది. అక్కడికి తల్లి వచ్చి ఆ పిల్ల శరీరాన్ని కదిపి చూసింది. అది లేవలేదు. మళ్ళీ కదిపింది కదలలేదు. ఈసారి గట్టిగా కాలితో తోసింది. అప్పుడూ ఆ పిల్ల పెంగ్విన్ లో చలనం లేదు. దీంతో విషయం తల్లి పెంగ్విన్ కు అర్ధం అయిపొయింది ఆ పిల్ల దగ్గరకు వచ్చి దాని శరీరాన్ని కాలితో.. రెక్కలతో పట్టుకుని చూస్తోంది. దుఃఖంతో ఉండిపోయింది. ఇదంతా గమనిస్తున్న తండ్రి పెంగ్విన్ తల్లి పెంగ్విన్ దగ్గరకు వచ్చి ఓదారుస్తోంది. నిజంగా.. ఈ వీడియో చూస్తుంటే.. ఆ పిల్ల పెంగ్విన్ కోసం పెద్ద పెంగ్విన్ లు పడుతున్న ఆరాటం చూస్తుంటే మనసు చివుక్కు మంటుంది. ఇక్కడ ఆ వీడియో ట్వీట్ చూడండి.
All lives matter…
These two penguins are mourning the loss of their babies. Heartbreaking
May god give strength to those who have lost their near & dear ones in the raging pandemic? pic.twitter.com/RiRHy7JH7Q
— Susanta Nanda IFS (@susantananda3) April 26, 2021
“అన్ని జీవితాల విషయం ఇదే. ఈ రెండు పెంగ్విన్లు తమ పిల్లలను కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. హృదయ విదారకం. కరోనా మహమ్మారిలో తమ దగ్గరి మరియు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు బలం చేకూరుస్తాడు ”అని సుసాంత నంద పోస్ట్ కు ఇచ్చిన శీర్షికలో పేర్కొన్నారు.
ఈ వీడియో పై నెటిజన్ల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి..
May god give each of us power to go through this tough phase. We have to win this fight and ensure to live safely.
— Pushpendra Singh (@Pushp_Tweet) April 26, 2021
All lives matter…
These two penguins are mourning the loss of their babies. Heartbreaking
May god give strength to those who have lost their near & dear ones in the raging pandemic? pic.twitter.com/RiRHy7JH7Q
— Susanta Nanda IFS (@susantananda3) April 26, 2021
यही तो है माँ का दर्द
— chhatrashal pathak (@ChhatrashalP) April 26, 2021
Funny Chimpanji: ఈ చింపాంజీ చేస్తున్న విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.. మరి మీరు?