Trending: ఎవరెస్ట్‌ శిఖరంపై అరుదైన జంతువు.. పొట్టి కాళ్లు, పొడవైన వెంట్రుకలు.. దగ్గరికెళ్లి చూడగా..

ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు మనుగుడ సాగిస్తున్నాయి. కాలక్రమేణా కొన్ని అంతరించిపోతే.. మరికొన్ని అంతరించిపోయే దశలో ఉండి అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. తాజాగా అలాంటి జంతువు..

Trending: ఎవరెస్ట్‌ శిఖరంపై అరుదైన జంతువు.. పొట్టి కాళ్లు, పొడవైన వెంట్రుకలు.. దగ్గరికెళ్లి చూడగా..
Rare Animal
Follow us

|

Updated on: Jan 28, 2023 | 6:58 PM

ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు మనుగుడ సాగిస్తున్నాయి. కాలక్రమేణా కొన్ని అంతరించిపోతే.. మరికొన్ని అంతరించిపోయే దశలో ఉండి అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. తాజాగా అలాంటి జంతువు ఒకటి శాస్త్రవేత్తల కంట పడింది. అదీ కూడా అక్కడా ఇక్కడా కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతం పై. ఎవరెస్ట్‌ శిఖరంపై అత్యంత అరుదైన అడవిజాతి పిల్లి దర్శనమచ్చింది. జంతు శాస్త్రవేత్తలు తాజాగా ఈ అరుదైన జీవిని ఎవరెస్ట్‌ శిఖరంపై కనుగొన్నారు. పల్లాస్‌ క్యాట్స్‌గా పిలిచే ఈ అడవి పిల్లులు ఇలా ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిసారి అని తెలిపారు..! సాధారణంగా గ్రామాల్లో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. పల్లాస్‌ క్యాట్స్‌ కూడా అడవి పిల్లులే అయినా ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని మనూల్‌లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను 1776లో మొదటిసారి బైకాల్‌ సరస్సు పరిసర ప్రాంతంలో పీటర్‌ సైమన్‌ పల్లాస్‌ అనే జంతుశాస్త్రవేత్త గుర్తించారు. అందుకే వీటికి పల్లాస్‌ క్యాట్స్ అనే పేరు వచ్చింది.

పల్లాస్‌ క్యాట్స్‌ ఆయా పరిసరాలను బట్టి గ్రే, బూడిద, ఎరుపు రంగుల్లో ఉంటాయి. తలకు ఇరువైపుల గుండ్రంగా చిన్ని చిన్ని చెవులతో, 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవైన తోక కలిగి ఉంటాయి. వీటి కాళ్లు కూడా చాలా పొట్టిగా ఉంటాయి. వీటి శరీరంపై పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. అయితే, వీటి వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు రెండింతలు ఎక్కువ పొడవుతో ఉంటాయి.

ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో నివసిస్తాయి కనుక.. చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి. ఇవి ఎక్కువగా హిమాలయాలు, టిబెట్‌ పీఠభూమి, ఇరానియన్‌ పీఠభూమి, దక్షిణ సైబీరియన్‌ కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.