Viral News: సాధారణంగా మనదగ్గర నాలుగేళ్లలోపు చిన్నారులు ఏం చేస్తారు.? ఏముంది.. ఎంచక్కా ఆడుకుంటూ, అమ్మనాన్నలతో సరదాగా గడిపేస్తారు అంటారా.? అయితే ఓ సంస్థ మాత్రం నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. వారికి జీతం సైతం అందిస్తోంది. నాలుగేళ్ల లోపు చిన్నారులు ఉద్యోగం చేయడం ఏంటి.? వారికి జీతం ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా.? ఈ వివరాలు తెలియాంటే మనం జపాన్ వరకు వెళ్లి రావాల్సిందే..
జపాన్‌లోని కిటక్యుషులోని ఓ నర్సింగ్ హోమ్ నాలుగేళ్ల లోపు చిన్నారులను హైర్ చేసుకుంటున్నామని ప్రకటన జారీ చేసింది. ఇందుకోసం చిన్నారులకు అవసరమైన ఫుడ్, డైపర్స్‌ను జీతంగా అందిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే జపాన్‌లో ఉన్న వృద్ధుల మొహాల్లో చిరునవ్వులు పూయించడానికే. నర్సింగ్ హోమ్‌లో ఉండే వృద్ధులకు కంపెనీ ఇవ్వడానికి చిన్నారులను హైర్ చేసుకుంటున్నారు. ఇందులో చేరడానికి పిల్లల వయస్సు నాలుగు సంవత్సరాల లోపే ఉండాలి. వారికి ఇష్టమైన సమయంలో నర్సింగ్ హోంకు రావొచ్చు.
అంతేకాకుండా చిన్నారులతో పాటు వారి కేర్ టేకర్ నర్సింగ్ హోమ్‌కు రావొచ్చు. ప్రస్తుతం ఈ నర్సింగ్ హోమ్‌లో 80 ఏళ్ల వయసున్న 100 మంది వృద్ధులు ఉన్నారు. ఇప్పటి వరకు 30 మంది చిన్నారులను తీసుకున్నారు. చిన్నారులను చూసిన వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇది వృద్ధుల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ఏది ఏమైనా సొంత మనవళ్లు, మనవరాళ్లతో గడపాల్సిన వాళ్లు ఇలా ఎవరి పిల్లలతో గడపడం ఒకింత ఇబ్బందికరంగానే ఉన్నా ఆ దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి మరి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..