కొన్ని సార్లు సరదా కోసం చేసిన పనులు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రస్తుతం కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా.. చాలా మంది రకరకాల విన్యాసాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కడపడితే అక్కడ తమ విన్యాసాయలను ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో అవే విన్యాసాలు రివర్స్ రివర్స్ అయ్యి ప్రాణాల మీదకు తేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా మారిపోయింది అతని వ్యవహరం.. చిన్నపిల్లాడిగా మారి ఎంజాయ్ చేస్తూ ఆటలాడుతున్న ఆ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఎంతో సంబరంగా… ఆనందంతో ఎంజాయ్ చేస్తున్న ఆ వ్యక్తి అనుకోకుండా జరిగి ఘటనతో దెబ్బకు కళ్లు బైర్లు కమ్మాయి.
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి స్విమ్మింగ్ ఫూల్ పక్కన తెగ ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ ఫూల్ పక్కనే ఉన్న ఏరియాలో జారుతూ ఆటలాడుతూ ఉన్నాడు. అయితే పరుగెత్తుతూ వచ్చి జారుతూ వెళ్తుండగా.. అదే దారిలో కార్ పార్క్ చేసి ఉంది. అయితే జారుతూ వెళ్లిన వ్యక్తి తనను తాను కంట్రెల్ చేసుకోలేక వేగంగా వెళ్లి ఆ కారును వెనక నుంచి బలంగా ఢికొట్టాడు. వెంటనే అతని ముఖానికి బలంగా గాయమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
Also Read: Avika Gor: బక్కచిక్కిన భామ చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పిక్స్
Celebrity Divorce Couples: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..