Viral Video: తల్లి ప్రేమ కోసం పరితపించిన పిల్ల కోతి.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..!

జపాన్‌లోని ఇచికావా నగరంలోని జూ పార్కులో అందరి హృదయాలను కదిలించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మాతృ ప్రేమ కోసం పరితపించిన ఒక చిన్న కోతి కథ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. పంచ్ అనే ఈ చిన్న కోతి వయసు కేవలం ఏడు నెలలు, కానీ దాని కథ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది.

Viral Video: తల్లి ప్రేమ కోసం పరితపించిన పిల్ల కోతి.. కన్నీరు పెట్టిస్తున్న ఘటన..!
Little Monkey Plushie Mother

Updated on: Feb 19, 2026 | 4:42 PM

జపాన్‌లోని ఇచికావా నగరంలోని జూ పార్కులో అందరి హృదయాలను కదిలించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మాతృ ప్రేమ కోసం పరితపించిన ఒక చిన్న కోతి కథ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. పంచ్ అనే ఈ చిన్న కోతి వయసు కేవలం ఏడు నెలలు, కానీ దాని కథ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది. పుట్టిన వెంటనే పంచ్‌ను దాని తల్లి వదిలివేసింది. చాలా చిన్నగా ఉండటం వల్ల, ఒంటరిగా, అభద్రతా భావంతో బిక్కుబిక్కుమంటూ గడిపేస్తుంది.

జూ సిబ్బంది పంచ్‌ను ఓదార్చడానికి ఓ ఆలోచన చేశారు. ఒక మృదువైన బొమ్మను పంచ్‌కు ఇచ్చారు. ఈ బొమ్మ పంచ్‌కు కేవలం ఆట వస్తువుగా మాత్రమే కాదు, ప్రేమ, అనుబంధానికి చిహ్నంగా మారింది. పంచ్ తన ఓరా-మామా అనే బొమ్మను పట్టుకుని జూ మొత్తంగా తిరుగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో చూసి జనం కదిలిపోయారు. సోషల్ మీడియాలో #KeepGoingPunch అనే హ్యాష్‌ట్యాగ్‌తో అతన్ని ఉత్సాహపరిచారు.

ఓరా-మామా బొమ్మ రాకతో.. పంచ్ జీవితం నెమ్మదిగా మారడం ప్రారంభించింది. మొదట్లో, తన బొమ్మను పట్టుకుని ఇతర కోతుల నుండి దూరంగా ఉండేది. కానీ జూ సిబ్బంది క్రమంగా దాన్ని ఇతర కోతులకు పరిచయం చేశారు. కొద్దిరోజులకే, పంచ్ తన కొత్త సహచరుడితో కలిసి ఉండటం ప్రారంభించింది. మొదట్లో కొంచెం భయపడి, సంకోచించేది. కానీ క్రమంగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇతర కోతులతో ఆడుకోవడం, నవ్వడం ప్రారంభించింది పంచ్. ఇకపై ఒంటరిగా లేదు. క్రమంగా పంచ్ జీవితాన్ని ప్రేమ, అనుబంధంతో నింపింది. పిల్ల కోతి ఆనందం ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

పంచ్, దాని కొత్త స్నేహితుల వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. జనం, “వావ్, ఎంత మధురమైన క్షణం! పంచ్ వద్ద ఇప్పటికీ ఆ బొమ్మ ఉంది, తన కొత్త జీవితం, కొత్త కుటుంబంతో నిజమైన భద్రతను పొందుతోంది” అని అంటున్నారు. పంచ్‌ను మందలోకి తిరిగి చేర్చడం అంత సులభం కాదు. కొత్త ముఖాలు, తెలియని పరిసరాలు, సంక్లిష్టమైన కోతుల సామాజిక నియమాలు మొదట్లో చాలా జాగ్రత్త అవసరం. కానీ పంచ్ క్రమంగా తన భయాన్ని అధిగమించి సామాజిక బంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభించిందని జూ సిబ్బంది తెలిపారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పంచ్ పట్ల, దాని కథ పట్ల నెటిజన్లు అపారమైన ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు. పిల్ల కోతి అమాయకత్వం, ఒంటరితనం నుండి స్నేహం, అనుబంధం వైపు తన ప్రయాణం చూసి జనం చలించిపోయారు. కొందరు పంచ్ చాలా ముద్దుగా ఉన్నారని, దాని చిన్న చేతుల్లో బొమ్మను పట్టుకున్న విదానం చూసి నా హృదయాన్ని కరిగించారని అన్నారు. మరొకరు పంచ్ ఒంటరితనాన్ని అధిగమించి ఒక కుటుంబాన్ని వెతుక్కున్నాడని వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారు “కొత్త జీవితాన్ని కొనసాగించండి, పంచ్, మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాము” అని రాశారు. చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. పంచ్‌ను చూసి వారి కళ్ళలో నీళ్లు వచ్చాయని, “చిన్న జీవులు కూడా ఇంత పెద్ద భావోద్వేగాలను అనుభవిస్తాయని” రాశారు.

పిల్ల కోతి పంచ్ వీడియోలు ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us