ఎవరిదైన మొబైల్ ఎక్కడైన పోతే ఆ ప్రాంతలో వెతుకుతారు. ఒకవేళ నీటిలో పడిపోతే అందులో వెతుకుతారు. దొరకకపోతే ఇక చేసేదేం లేక చేతులెత్తేస్తారు. అయితే ఓ ప్రభుత్వ అధికారి మాత్రం తన సెల్‌ఫోన్ రిజర్వాయర్‌లో పడిపోయిందని ఏకంగా ఆ నీటిని బయటకు ఎత్తిపోయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే చత్తీస్‌గఢ్ కంకారా జిల్లాలో కొల‍్లబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్‌కట్ట డ్యామ్‌కు వచ్చారు. అయితే అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్‌ఫోన్ ఆ రిజర్వాయర్‌లో పడిపోయింది. స్థానిక ఈతగాళ్లతో ఫోన్ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో 30హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లతో మూడు రోజులపాటు 21 లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడేశారు. వాస్తవానికి ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. చివరికి రాజేష్ కు తన ఫోన్ లభించింది. కానీ ఆ ఫోన్ మూడురోజుల పాటు నీటిలోనే ఉండటం వల్ల పాడైపోయింది. అయితే ఇలా ఎందుకు చేశావని రాజేష్‌ను ప్రశ్నిస్తే ఆ ఫోన్లో అధికారిక సమాచారం ఉందని..ఆ నీరు వాడటానికి పనికిరాదని.. స్థానిక సబ్ డివిజినల్ అధికారి నుంచి కూడా అనుమతి తీసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు రాజేశ్ విశ్వాస్ అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని.. అతను కేవలం వర్బల్‍గానే అనుమతి పొందారని నీటి వనరుల అధికారులు తెలిపారు. నాలుగు అడుగుల వరకు మాత్రమే నీటిని ఎత్తిపోయడానికి అనుమతిచ్చామని కానీ అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని పేర్కొన్నారు. అయితే వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేయడంతో ఆ ప్రభుత్వ అధికారిపై నెటీజన్లు మండిపడుతున్నారు.
#Chhattisgarh | मामले को लेकर मुख्यमंत्री @bhupeshbaghel ने कहा – “फूड इंस्पेक्टर को सस्पेंड कर दिया गया है.”@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal https://t.co/Gy4dFIompS
— कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..