సోషల్ మీడియా ద్వారా ఫేమ్ పొందాలనే ఆరాటం.. రీల్స్‌కి లైక్, వ్యూస్ ఎక్కువ రావాలనే వ్యామోహం… ఇందుకోసం చాలా మంది రీస్కీ స్టంట్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా పిచ్చి పనలు చేస్తున్నారు. కొందరు అయితే రోడ్లపై, జనం మధ్యే తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. మరికొందరు కారుల్లో, బైక్స్‌పై ప్రయాణిస్తూ ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి కదులుతున్న రైలులో విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలిచింది.
నేటి యువత ఏదో ఒకటి డిఫరెంట్‌గా చేయాలనే తపనతో.. చాలాసార్లు ఇలాంటి పిచ్చి పనులు చేయడం మనందరికీ తెలిసిందే. ఒక అమ్మాయి తన జీవితం గురించి కూడా పట్టించుకోకుండా రైలు డోర్‌కు వేలాడుతూ విన్యాసాలు చేస్తూ కనిపించిన ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఫైరవుతున్నారు.
వీడియో దిగునవ చూడండి..
वायरल होने का बहुत जुनून सवार हो गया है आजकल इनलोगों को 😐
🎥: Suleta_Cute_girl_500k pic.twitter.com/wWXuESMrCr
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) September 5, 2024
ఈ వీడియో చూశాక అది రైలు లోపల నుంచి రికార్డయినట్లు అర్థమవుతోంది. ఆ యువతి రైలు డోర్ వద్ద నిలబడి బయటకు వాలి విన్యాసాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆమె హ్యాండిల్‌ని చేతులతో పట్టుకుని వెనుకకు వేలాడుతూ కనిపించింది. రైలు ఆ సమయంలో చాలా వేగంగా వెళ్తుంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చేయి జారితే పరిస్థితి ఊహించడం కూడా కష్టమే. వీడియో చివర్లో అమ్మాయి సురక్షితంగాన మళ్లీ రైలు లోపలికి రావడం కనిపిస్తుంది.
ఈ వీడియో @ChapraZila అనే అకౌంట్ నుంచి Xలో షేర్ చేశారు. వీడియోను ఐదు వేల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. డియర్ సిస్టర్.. మరో లైఫ్ ఉంటుందో లేదో తెలీదు.. ఉన్న ఉక్క జిందగీని ఇలాంటి పనులు కోసం రిస్క్‌లో పెట్టొద్దు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ వీడియో చూసిన తర్వాత, దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.ః
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..