ప్రియుడి పక్కన సీటు ఇవ్వలేదని.. ఎయిర్‌హోస్టెస్‌పై దాడి!

| Edited By:

Aug 17, 2019 | 7:59 PM

ప్రియుడి పక్కన సీటు అడిగితే ఇవ్వలేదనే కారణంతో ఓ ప్రయాణికురాలు ఎయిర్ హోస్టెస్‌పై వేడి నీళ్లు పోసింది. ఎయిర్ ఏసియా ఎయిర్‌హోస్టెస్ నురాలియా మజ్లాన్ తన సహోద్యోగికి ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. చైనాకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి విమానం ఎక్కింది. అయితే, వారికి వేర్వేరు సీట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె తన ప్రియుడి పక్క సీట్లో సీటు కావాలని ఎయిర్ హోస్టెస్‌ను కోరింది. అయితే, అప్పటికే విమానంలో […]

ప్రియుడి పక్కన సీటు ఇవ్వలేదని.. ఎయిర్‌హోస్టెస్‌పై దాడి!
Follow us on

ప్రియుడి పక్కన సీటు అడిగితే ఇవ్వలేదనే కారణంతో ఓ ప్రయాణికురాలు ఎయిర్ హోస్టెస్‌పై వేడి నీళ్లు పోసింది. ఎయిర్ ఏసియా ఎయిర్‌హోస్టెస్ నురాలియా మజ్లాన్ తన సహోద్యోగికి ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. చైనాకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి విమానం ఎక్కింది. అయితే, వారికి వేర్వేరు సీట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె తన ప్రియుడి పక్క సీట్లో సీటు కావాలని ఎయిర్ హోస్టెస్‌ను కోరింది. అయితే, అప్పటికే విమానంలో అన్ని సీట్లు నిండిపోవడంతో, ఆమె ప్రియుడి పక్కన కూర్చున్న వ్యక్తి సీటు మారేందుకు అంగీకరించలేదు. దీంతో ఆమెకు కేటాయించిన సీట్లోనే కూర్చోవాలని ఎయిర్‌ హోస్టెస్ వెల్లడించింది.

ఆగ్రహానికి గురైన ఆ యువతి నూడుల్స్ కోసం కప్పులో వేసుకున్న వేడి నీటిని ఎయిర్ హోస్టెస్ ముఖం మీద వేసి.. ఆమెపై కేకలు వేసింది. ఆమెను సమర్దిస్తూ ప్రియుడు కూడా రెచ్చిపోయాడు. విమానాన్ని పేల్చేస్తాని హెచ్చరించాడు. దీంతో సిబ్బంది వారికి సర్దిచెప్పి శాంతపరిచారు. విమానం గమ్యానికి చేరిన తర్వాత విమానాశ్రయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. భద్రతా సిబ్బంది ఆ జంటను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. ఆమె మరెప్పుడూ ఎయిర్ ఏసియా విమానంలో ప్రయాణించకుండా నిషేదం విధించారు.