ఎనిమిదేళ్ల బాలుడి కోసం క్లాస్‌మేట్స్‌, టీచర్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌… అది చూస్తే రియాక్షన్‌ ఎవరికైనా ఏడుపే..!

|

Nov 10, 2023 | 12:01 PM

ఇదంతా చూసిన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి ముఖంలో ఆనందం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిందని వీడియో చూసిన వారు చెబుతున్నారు. క్లాస్ లో అతనికి ఎదురైన అనుభూతికి ఆ బాలుడు ఆనందంతో ఏడ్చేశాడు... అతను కాసేపు అలా తలుపు దగ్గరే ఉండిపోయాడు. అంతలోనే వెనక నుండి వచ్చిన క్లాస్ టీచర్ బాలుడి భుజాలపై చేతులు వేసి, పట్టుకుని లోపలికి తీసుకు వచ్చింది. ఆ తర్వాత పిల్లలంతా ఒక్కచోట చేరి అతన్ని

ఎనిమిదేళ్ల బాలుడి కోసం క్లాస్‌మేట్స్‌, టీచర్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌... అది చూస్తే రియాక్షన్‌ ఎవరికైనా ఏడుపే..!
Birthday Surprise
Follow us on

ఇతరుల ముఖాల్లోని చిరునవ్వులు మనకు జీవిత సౌందర్యాన్ని బోధిస్తాయి. మీ జీవితంలో చిన్నవిషయాలుగా అనిపించే పనుల ద్వారా ఒక్కోసారి ఎదుటివారిని ఎంతగానో సంతోషపడేలా చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంది. ఎనిమిదేళ్ల బాలుడి కోసం క్లాస్‌మేట్స్, టీచర్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఆ బాలుడిని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసింది. ఇలాంటి సంతోషకర సంఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. కొలంబియాలోని ఎబెజికోలో పాఠశాల విద్యార్థి ఎనిమిదేళ్ల ఏంజెల్ డేవిడ్ పుట్టినరోజు వేడుకలను వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. క్లాస్‌ టీచర్‌ సహా తోటి విద్యార్థులంతా కలిసి ఏంజెల్ కోసం ఊహించని పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. అది చూసిన ఏంజెల్‌ పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా ఏడ్చేశాడు. అసలు విషయం ఏంటంటే..

ఏంజెల్‌ తన పుట్టినరోజును జరుపుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతని కుటుంబం ఆర్థికంగా నిరుపేద కుటుంబం..ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలను నిర్వహించలేకపోయింది. కారణం తెలియదు గానీ, ఎనిమిదేళ్ల చిన్నారి సహా నలుగురు పిల్లలను పోషించే బాధ్యత వారి తల్లి భుజాలపైనే పడింది. ఈ పరిస్థితిని గ్రహించిన ఏంజెల్ డేవిడ్ క్లాస్‌ టీచర్‌ అతని ఎనిమిదో పుట్టినరోజును పెద్ద వేడుకగా చేయాలని నిర్ణయించుకున్నాడు. క్లాస్‌ రూమ్‌లోనే బాలుడికి తెలియకుండా పుట్టిన రోజు వేడుకలను ఏర్పాటు చేశారు. క్లాస్‌ టీచర్‌ నేతృత్వంలో తరగతి గదిలోని విద్యార్థులందరూ ఏంజెల్ కోసం ఊహించని పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. అతడు క్లాస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే తన క్లాస్‌మేట్స్ అంతా కలిసి పాటలు పాడుతూ పలకరించారు. ఇదంతా చూసిన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి ముఖంలో ఆనందం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిందని వీడియో చూసిన వారు చెబుతున్నారు. క్లాస్ లో అతనికి ఎదురైన అనుభూతికి ఆ బాలుడు ఆనందంతో ఏడ్చేశాడు… అతను కాసేపు అలా తలుపు దగ్గరే ఉండిపోయాడు. అంతలోనే వెనక నుండి వచ్చిన క్లాస్ టీచర్ బాలుడి భుజాలపై చేతులు వేసి, పట్టుకుని లోపలికి తీసుకు వచ్చింది. ఆ తర్వాత పిల్లలంతా ఒక్కచోట చేరి అతన్ని కౌగిలించుకుని బర్త్‌డే విషేస్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల మంది వీక్షకులు ఇష్టపడ్డారు. చిన్నారుల మదిలో మెదిలిన మంచితనాన్ని, వారిలో జీవిత సౌందర్యాన్ని నింపిన టీచర్‌ను అభినందించాల్సిందేనంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు.  ఇలాంటి కామెంట్లు, ప్రశంసలతో నెటిజన్లు వీడియోను ఎంతగానో లైక్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..