Viral Video: ఇంట్లో ఉన్న పాత టీవీలోంచి వింత శబ్ధాలు.. ఏంటని టార్చ్‌ వూచూడగా గుండెలదిరే దృశ్యం..

సోషల్‌ మీడియాలో తరచూ అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లోని టీవీ నుంచి ఏకంగా 8 ఆడుగుల భారీ పాము బయటకొచ్చింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Viral Video: ఇంట్లో ఉన్న పాత టీవీలోంచి వింత శబ్ధాలు.. ఏంటని టార్చ్‌ వూచూడగా గుండెలదిరే దృశ్యం..
Viral Snake Video

Updated on: Mar 27, 2026 | 4:10 PM

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడికి మనుషులే కాదు వణ్యప్రాణాలు, సరీసృపాలు సైతం తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాయి. అందుకే చల్లని ప్రదేశాలను నివాసంగా చేసుకొని అక్కడే తిష్టవేస్తున్నాయి. తాజాగా ఇలానే బయటఎండలను తట్టుకోలేని ఓ పాము ఇంట్లోకి దూరింది. అంతటిలో ఆగకుండా అక్కడే ఉన్న ఓ టీవీలోకి వెళ్లి తిష్టవేసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకాలోని మల్లయ్యపుర గ్రామంలోని దొడ్డమడప్ప అనే వ్యక్తి ఉదయం టీవీ ఆన్‌ చేసేందుకు వెళ్లగా దానిలోంచి ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. ఏంటని టీవీ ఓపెన్ చేయగా అందులో ఓ భారీ పాము కనిపించింది.

అంతే టీవీలో పామును చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. బాధితుడి సమాచారంతో హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్‌.. ఎంతో చాకచక్యంగా టీవీలో దాగి ఉన్న 8 అడుగుల భారీ పామును బయకు తీసి పట్టుకున్నాడు. అతనంతం దాన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. దీంతో ఇంట్లోని కుటుంబసభ్యులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us