కడప-చెన్నై రహదారిపై నందలూరు ఆల్విన్ కర్మాగారం వద్ద మద్యం లారీ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. వేలాది మద్యం బాటిళ్లు పగిలిపోవడంతో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ఘటనపై విచారణ ప్రారంభించారు.