
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. ఆ స్టోరీ ఏంటో.? ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ కుటుంబం 305 బిలియన్ డాలర్ల ఆస్తులతో 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. సంపద విలువ అక్షరాలా 25 లక్షల 38 వేల 667 కోట్ల రూపాయలు. షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్.. ఈ కుటుంబ పెద్ద. 18 మంది సోదరులు, 11 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అల్ నహ్యాన్ తొమ్మిది మంది సంతానం, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. పలు అంతర్జాతీయ ప్రముఖ కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలున్నాయి. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ వీరి యాజమాన్యంలోనే ఉంది.
ఈ కుటుంబం నివసించే లగ్జరీ భవంతిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అబుదాబీలోని ఖాసర్ అల్ వాటన్ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు. యూఏఈలో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దది ఇదే. పెంటగాన్ వైశాల్యానికి మూడు రెట్లు ఎక్కువ. 94 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ 4,078 కోట్ల రూపాయలు. అమెరికాలోని పలు నగరాలతో పాటు బ్రిటన్ రాజధాని లండన్, ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్ నహ్యాన్ కుటుంబానికి ఆస్తులున్నాయి. అలాగే ఎస్‌యూవీ, మెర్సిడెస్ బెంజ్, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు, 8 విమానాలు కూడా ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం యూఏఈ రాయల్ ఫ్యామిలీ లండన్‌లోని బ్రిటిష్ రాజకుటుంబంతో సరిసమానమైన ఆస్తులు కలిగి ఉంది. పలు ప్రైవేటు విమానాలు, వందల కార్లు వీరి సొంతం. వేల కోట్లు విలువ చేసే నౌకలు, విమానాలు వారి లగ్జరీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة!
اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb— Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022