Shocking Video: కొన్ని ఘటనలు మనల్ని షాక్‌కు గురిచేస్తాయి. ప్రమాదం ఎటు వైపు నుంచైనా రావొచ్చు. ఆకాశం విరిగి మీద పడొచ్చు. భూమి అమాంతం మనల్ని మనల్ని లోపలికి లాగేసుకుపోవచ్చు. ఏంటి నమ్మడం లేదా…? అయితే మీ కోసం ఓ వీడియోను తీసుకొచ్చాం. రాజస్థాన్ జైసల్మేర్లో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ షాకింగ్ విజువల్స్ రికార్డయ్యాయి. ఓ మెకానిక్ షాపు వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓవ్యక్తి బైక్కు పంచర్ వేస్తుండగా.. మరో నలుగురు యువకులు పక్కనే నిల్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒకేచోట నిలబడటంతో.. వారి బరువుకు డ్రైనేజీపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్ విరిగిపోయింది. దీంతో ఐదుగురు డ్రైనేజీలో పడిపోయారు. మరమ్మత్తులు చేస్తోన్న ఓ బైక్ కూడా వారిపై పడిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ స్వల్పమైన గాయాలతోనే వీరంతా బయటపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వారందరికీ గడ్డి గింజలులన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి…
The bandages on the #Jaisalmer drain were broken, after seeing 3 seconds, five people including the bike were trapped in the pit. You will also be surprised to see the view@varialtv @the_viralvideos @TheViralFever @itsgoneviraI pic.twitter.com/lrMQCoIjnG
— चंद्र शेखर व्यास (News18Rajasthan) (@ShekharVyas10) April 13, 2022