Viral: 3 గంటల్లో ఏకంగా రూ. 4 లక్షల సంపాదన.. ఎలాగో తెలిస్తే బిత్తరపోతారు

|

Oct 02, 2024 | 3:31 PM

కొందరికి రాత్రింబవళ్లు కష్టపడితేనే గానీ.. నెలకు రూ. 30 వేల జీతం రాదు. ఇంకొందరు తమ స్మార్ట్ వర్క్‌తో నెలకు లక్షల్లో సంపాదన గడిస్తారు. మరికొందరైతే వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూపోతారు. అయితే మీరప్పుడైనా.. కేవలం 3 గంటల్లో రూ. 4 లక్షలు సంపాదన ఆర్జించారా.?

Viral: 3 గంటల్లో ఏకంగా రూ. 4 లక్షల సంపాదన.. ఎలాగో తెలిస్తే బిత్తరపోతారు
Viral Post
Follow us on

కొందరికి రాత్రింబవళ్లు కష్టపడితేనే గానీ.. నెలకు రూ. 30 వేల జీతం రాదు. ఇంకొందరు తమ స్మార్ట్ వర్క్‌తో నెలకు లక్షల్లో సంపాదన గడిస్తారు. మరికొందరైతే వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూపోతారు. అయితే మీరప్పుడైనా.. కేవలం 3 గంటల్లో రూ. 4 లక్షలు సంపాదన ఆర్జించారా.? చాలా సింపుల్ బాసూ.! ఓ యువతి తన బుర్రకు పదునుపెట్టి.. ఈ డబ్బును అత్యంత సింపుల్‌గా సంపాదించింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దామా..

ఈ మధ్యకాలంలో అది వ్యాపారమైనా.. లేదా మరేదైనా సంస్థ అయినా.. జనాల్లోకి వెళ్లాలంటే.. సోషల్ మీడియా మార్కెటింగ్ తప్పనిసరి అయిపోయింది. ఇక్కడ ఈ యువతి కూడా అదే పని చేసింది. దెబ్బకు 3 గంటల్లో లక్షాధికారి అయిపొయింది. శ్వేతా కుక్రేజా అనే యువతి సోషల్ మీడియా స్ట్రాటజీ ద్వారా 3 గంటల్లో రూ.4.40 లక్షలు జీతం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

‘ఈ నెలలో నేను ఒక క్లయింట్ నుంచి 5,200 డాలర్లు(దాదాపుగా రూ.4,40,000) అందుకున్నాను. అతడి సోషల్ మీడియా స్ట్రాటజీ కోసం కేవలం 3 గంటలు మాత్రమే పని చేశాను. ఇలాంటి రోజులు పనిని మరింత సంతృప్తికరంగా చేసేలా చేస్తాయి’ అని ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. కాగా, ఈ పోస్ట్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ‘ఇది అసలైన విజయం’ అంటూ ఒకరు.. ‘ఇదంతా చూస్తుంటే నేను కార్పోరేట్ జాబ్ మానేసి.. ఈ పని చేయాలనిపిస్తోంది’ అని మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఆ ట్వీట్‌పై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..