Watch: ఏమైందో ఏమోగానీ.. ముగ్గురు వ్యక్తులపై ఏకంగా 25 మంది దాడి.. షాకింగ్‌ వీడియో వైరల్

ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్ట్ చేశారు. బాధితులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. వివాదానికి కారణం పాత కక్ష్యలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, మొత్తం దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా.. సోషల్ మీడియా ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

Watch: ఏమైందో ఏమోగానీ.. ముగ్గురు వ్యక్తులపై ఏకంగా 25 మంది దాడి.. షాకింగ్‌ వీడియో వైరల్
People Attack

Updated on: Jun 04, 2025 | 2:19 PM

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కొల్హాపూర్‌లో పట్టపగలు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ముగ్గురు వ్యక్తులపై హింసాత్మక దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులపై ఏకంగా 25 మంది వరకు ఉన్న ఓ గ్యాంగ్‌ దాడికి పాల్పడింది. కర్రలు, రాడ్లతో వచ్చిన ముఠా రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ముగ్గురిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా.. సోషల్ మీడియా ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్ట్ చేశారు. బాధితులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. వివాదానికి కారణం పాత కక్ష్యలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..