ఆ బ్యాంక్ ఎప్పటిలానే రద్దీగా ఉంది. అప్పుడే ఓ 12 ఏళ్ల పిల్లాడు లోపలికి ఎంటర్ అయ్యాడు. అక్కడున్న బ్యాంక్ సిబ్బంది.. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఈ పిల్లాడు లోపలికి వచ్చిన విషయాన్ని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. సీన్ కట్ చేస్తే.. కాసేపటికి ఆ పిల్లాడు చేతిలో ఓ పెద్ద బ్యాగ్‌తో బయటికి వచ్చాడు. అసలు ఇంతకీ లోపల ఏం జరిగింది.? ఆ పిల్లాడి చేతిలోని బ్యాగ్‌లో ఏమున్నాయి.? ఆ కథేంటంటే!
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని పాటియాలా సిటీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ రద్దీగా ఉన్న సమయంలో ఓ 12 ఏళ్ల పిల్లాడు లోపలికి వచ్చాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా.. ఆ పిల్లాడు బ్యాంక్ అంతటా తిరిగి కాసేపటికి రూ. 35 లక్షల బ్యాగ్‌తో బయటికొచ్చాడు.
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ఆ డబ్బును సెక్యూరిటీ సిబ్బంది ఒక పక్కన పెట్టగా.. వారిని ఈ పిల్లాడు గమనిస్తూ వచ్చాడు. సరైన సమయం చూసుకుని ఆ రూ. 35 లక్షల బ్యాగ్‌తో ఉడాయించాడు. బ్యాగ్ పోయిందని తెలుసుకుని అక్కడున్న సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. అసలు విషయం బయటపడింది. బ్యాగ్‌ను పిల్లాడు కాజేశాడని విజువల్స్‌లో చూడగా.. బ్యాంక్ సిబ్బంది దెబ్బకు షాకయ్యారు. కాగా, పోలీసులకు బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. వారు పిల్లాడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Patiala SBI robbery CCTV: 12-year-old caught on cam stealing Rs 35 lakh in shocking viral video; Watch#bankrobbery #viralvideo #PunjabPolice pic.twitter.com/bDPywQqUVz
— True Scoop News (@TrueScoopNews2) August 3, 2022