Power Lifter: వందేళ్ల వయస్సులోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బామ్మ.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

|

Oct 18, 2021 | 3:58 AM

Power Lifter: సాధారణంగా 80 ఏళ్లు వచ్చేసరికి చాలా మంది పరిస్థితి దారుణంగా మారిపోతుంది. తమ పనులు తాము కూడా చేసుకోలేని దుస్థితికి చేరుతారు.

Power Lifter: వందేళ్ల వయస్సులోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బామ్మ.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..
Old Age
Follow us on

Power Lifter: సాధారణంగా 80 ఏళ్లు వచ్చేసరికి చాలా మంది పరిస్థితి దారుణంగా మారిపోతుంది. తమ పనులు తాము కూడా చేసుకోలేని దుస్థితికి చేరుతారు. వృద్ధాప్య సమస్యలతో సతమతం అవుతుంటారు. ఏం చేయలేమనే నిరాశావాదంలో మునిగిపోతారు. మరికొందరు మాత్రం కాస్త భిన్నంగా ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. అప్పటివరకూ ఉరుకులు పరుగుల జీవితంతో ఏమీ చేయలేకపోయామని, ఇప్పుడు తమకు విశ్రాంతి దొరికిందని కొందరు తమలో దాగి ఉన్న నైపుణ్యతకు పదును పెడతారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలు.. తన వందేళ్ల వయసులోనూ సరికొత్త ప్రయత్నం చేసి అందరినీ వావ్ అనేలా చేసింది. పవర్‌ లిఫ్టర్‌గా వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. వయసు కేవలం నెంబర్‌ మాత్రమే నని మరోసారి బరువులెత్తి మరీ నిరూపించింది ఈ బామ్మ.

పైన ఫోటోలో కనిపిస్తున్న బామ్మ తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్‌ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్‌ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్‌ బామ్మ పేరు ఎడిత్‌ ముర్వే ట్రయిన్‌. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. అంటే ఆగస్టు 5వ తేదీన గిన్నిస్‌ రికార్డు సాధించింది. వృద్ధుల పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణి కూడా కాదు. ఆమె ఒక స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌లో డాన్స్‌ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్‌ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీ బామ్మ. పోటీల కోసం ప్రత్యేక ఆహారం కూడా ఏమీ తీసుకోవడం, ప్రత్యేకమైన ఎక్సర్‌సైజులు చేయడంలాంటి జాగ్రత్తలేవీ కూడా పాటించలేదట. కానీ రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిన్’ కాక్‌టెయిల్‌ తీసుకోవడం తనకు అలవాటని, బహుశా ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని చిరునవ్వులు చిందిస్తూ చెబుతోంది ఈ పవర్‌ లిఫ్టర్‌ బామ్మ.

Also read:

Nature of Earth: భూమిపై మరణం లేని జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!

Telangana Fears Tiger: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులులు.. ఏక కాలంలో రెండు పులుల దాడులు..

Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్‌ ఫెస్ట్‌ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..