Viral: పునాదులు తవ్వుతుండగా బయటపడ్డ పురాతన మట్టి కుండ.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్!

|

Jun 24, 2022 | 1:39 PM

నిర్మాణ పనుల్లో కూలీలు నిమగ్నమైపోయారు. అయితే వారికి పునాదుల్లో మట్టిని తవ్వుతుండగా భారీ శబ్దం ఒకటి వినిపించింది...

Viral: పునాదులు తవ్వుతుండగా బయటపడ్డ పురాతన మట్టి కుండ.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్!
Clay Pot
Follow us on

నిర్మాణ పనుల్లో కూలీలు నిమగ్నమైపోయారు. అయితే వారికి పునాదుల్లో మట్టిని తవ్వుతుండగా భారీ శబ్దం ఒకటి వినిపించింది. ఏంటా అని చూడగా అదొక మట్టి కుండ. దాని చుట్టూ ఉన్న మట్టిని తీసి.. ఆ కుండను బయటికి తీశారు. అందులో ఏముందా అని తెరిచి చూడగా వారి కళ్లు జిగేలుమన్నాయి. ఆ కథేంటో.?

వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని రాయకోట్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లమ్మే జట్టాపురా గ్రామంలో ఉన్న చారిత్రక గురుద్వార్ పునర్నిర్మాణంలో భాగంగా కూలీలు పునాది తవ్వుతుండగా ఓ పురాతన మట్టి కుండ బయటపడింది. ఇక దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అందులో వారికి 100కు పైగా బ్రిటీష్ కాలం నాటి పాత నాణేలు లభ్యమయ్యాయి. వాటిపై లోతైన అధ్యయనం చేయాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులను గురుద్వార్‌ నిర్వాహకులు కోరారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ”పునాదుల్లో మట్టిని తవ్వుతుండగా కూలీలకు 100కుపైగా బ్రిటీష్ నాణేలతో కూడిన మట్టి కుండ దొరికింది. అందులో ఒకటి బంగారు నాణెం కాగా.. మిగిలినవి వెండి నాణేలు. ఆ నాణేలకు సిక్కు చరిత్రతో ఎలాంటి సంబంధం లేదు. అవి ఏ కాలం నాటివో తెలుసుకునేందుకు వాటిపై అధ్యయనం చేయాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులను కోరుతున్నట్లు” శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యుడు గురుచరణ్ సింగ్ గ్రేవల్ వెల్లడించారు.