భారత్ కీ బాత్
మనకు 2023 సంవత్సరం వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలను మన మదిలో నిలిపింది. 2023 సంవత్సరంలో యావత్ ప్రపంచం భారత వైపు చూసింది. అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఈ సంవత్సరం మరింత పెంచింది. భారత్ మైత్రీ సంబంధాలను పెంపొందించుకునేందుకు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు దహతహలాడాయి. జీ20 శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం దేశ ప్రతిష్టను మరింత పెంచింది. ఓ రకంగా అంతర్జాతీయ అంశాల్లో భారత్ మాటకు విలువ పెరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల్లో పర్యటించి భారత వాణిని బలంగా వినిపించారు. ఆ దేశాలతో మైత్రీ సంబంధాలను మునుపెన్నడూ లేనంతగా బలోపేతం చేశారు. 2023లో భారత ప్రతిష్టను మరింత పెంచిన అంశాలు, సంఘటలను ఇప్పుడు ఒకసారి సింహావ లోకనం చేసుకుందాం..