Breaking News
  • నేడు, రేపు అమరావతిలో మహిళా జేఏసీ నేతల పర్యటన. రాజధాని ప్రాంతంలో దీక్షలకు సంఘీభావం తెలపనున్న.. అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ.
  • నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల నోటిఫికేషన్‌. 25న డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు. 29న చైర్మన్‌, ఉపాధ్యక్ష ఎన్నికలు.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం.
  • ఈ నెల 26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు. మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ.
  • ఏపీలో విద్యుత్‌ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కసరత్తు. ప్రీపెయిడ్‌ విధానాన్ని తీసుకురానున్న విద్యుత్‌ సంస్థలు. జూన్‌ నాటికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే యోచన.

మోదీ ప్రమాణ స్వీకారానికి ప్రముఖ సెలబ్రిటీలు

Top Celebs, మోదీ ప్రమాణ స్వీకారానికి ప్రముఖ సెలబ్రిటీలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులతో రాష్ట్రపతి భవనంలో సందడి నెలకొంది. విదేశీ ప్రతినిధులు, క్రీడాకారులు, బాలీవుడ్ ప్రముఖులు, జాతీయ నేతలు, ఎంపీలతో సహా దాదాపు 8 వేలమందికి పైగా ఆహ్వానాలు వెళ్లాయి. ఇవాళ సాయత్రం ఏడు గంటలకు వరుసగా రెండోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ కూడా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, గౌతమ్ ఆదానీ, లక్ష్మీ మిట్టల్ తదితర వ్యాపార దిగ్గజాలు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లారు. ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, కంగనా రనౌత్, షారుక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, కరణ్ జోహార్, ఆనంద్ ఎల్ రాయ్, మధుర్ బండార్కర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్లిన వారిలో ఉన్నారు.

Related Tags