Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 News, టాప్ 10 న్యూస్ @ 6PM

1.జగన్ విజయంపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారు..?

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొమ్మిది సీట్లు మాత్రమే సొంతం చేసుకోవడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విశ్లేషణ ఏంటి..? ఒకప్పుడు ఏపీకి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలన్న ప్రకాశ్ రాజ్…Read more

2.గుజరాత్‌లో కాంగ్రెస్‌కు బీటలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. పార్టీ చీఫ్ రాహుల్ త‌న ప‌ద‌విని వ‌దులుకునేందుకు మ‌క్కువ చూపుతున్న త‌రుణంలో.. గుజ‌రాత్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా …Read more

3.మోదీలో ఆ దిగ్గజాలను చూశాను – రజినీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, జయలలిత మాదిరిగానే నరేంద్ర మోదీ ప్రజాకర్షక నేత…Read more

4.మోదీ చెప్పినట్టే.. బెంగాల్‌లో టీఎంసీకి షాక్

మోదీ చెప్పినట్లే జరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీకి వెళ్లిన వారు కాషాయ కండువాను…Read more

5.మోదీ కేబినెట్‌లో.. అపర చాణక్యుడికి మొండి చెయ్యి.?

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఘనమైన విజయం సాధించింది కమలదళం. దీనితో మరోమారు కేంద్రంలో పాగా వేయడమే కాదు రెండోసారి కూడా ప్రధాని మంత్రిగా నరేంద్రమోదీ అధికార…Read more

6.మధ్యంతరానికి బీ రెడీ: యడ్యూరప్ప

కర్ణాటక తాజా రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని.. రాష్ట్రంలో 28 సీట్లకుగాను 25 సీట్లు గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు…Read more

7.ఇండియాకు దెబ్బ.. వ్యవసాయ సబ్సిడీలకు కోత ?

వ్యవసాయ సబ్సిడీల విషయంలో ఇండియాను దెబ్బ తీసేలా అగ్ర రాజ్యాలు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ముఖ్యంగా వ్యవసాయ సబ్సిడీలకు కోత విధించేట్టు జపాన్ చేయనున్న ఓ ప్రతిపాదన…Read more

8.నిజామాబాద్ జిల్లాలో దారుణం.. 1500 కుటుంబాల కుల బహిష్కరణ

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ గ్రామాభివృద్ధి కమిటీ.. అక్కడున్న 1500 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల్కొండలో 300కు పైగా పద్మశాలి…Read more

9.ఐనాక్స్‌ తెరలపై ఐసీసీ మ్యాచ్‌లు!

భారత్‌లో రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్‌ సంస్థ ఐనాక్స్‌… ఐసీసీతో చేతులు కలిపింది. రాబోయే ఐసీసీ ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో కొన్నింటిని తన భారీ తెరలపై ప్రసారం చేయనుంది. మే 30నుంచి ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచకప్‌ 2019…Read more

10.పాల్‌ అన్నా.. ఏం చేశావన్నా.?

ఏపీలో నెక్స్ట్ సీఎం తానేనంటూ హడావుడి చేసి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చిక్కుల్లో పడ్డాడు. తనని మోసం చేశారంటూ ఆయనపై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది…Read more

 

Related Tags