Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @1PM

1.‘ ఆ ఒక్కటి ‘ లేకుండానే ముగిసిన సమావేశాలు.. మరి… చర్చించిందేమిటి ?

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇద్దరూ మహాబలిపురంలో రెండు రోజులపాటు జరిపిన చర్చలు, నిర్వహించిన సమావేశాలు ముగిశాయి. లాంఛనంగా జరిగిన ఈ సమావేశాల్లో ఇద్దరూ ముఖాముఖీ, ఫ్రెండ్లీ భేటీలతో…Read more

2.ఇక్కడ సమ్మె.. అక్కడ మద్దతు.. రంగంలోకి ఏపీఎస్ ఆర్టీసీ కూడా !

తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ నేతలు సీఎం కేసీఆర్‌కు విఙ్ఞప్తి చేశారు…Read more

3.వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌‌షిప్: ఫైనల్‌కు చేరిన భారత యువకెరటం..!

భారత యువ బాక్సర్‌ మంజురాణి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్స్‌షిప్స్‌ 48 కేజీల విభాగంలో ఫైనల్‌‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో…Read more

4.బ్రేకింగ్: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు…Read more

5.ఢిల్లీలో రెచ్చిపోతున్న స్నాచర్లు..ప్రధాని సోదరుడి కుమార్తె హ్యాండ్‌ బ్యాగు చోరీ

దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్‌ మోదీ హ్యాండ్‌బ్యాగునే దుండగులు గుంజుకొని వెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలోని సివిల్‌ లైన్స్‌ ఏరియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది…Read more

6.ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కన్నుమూత

సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన శ్రీను మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేశారు….Read more

7.బ్రేకింగ్ : కాలిన గాయాలతో చికిత్స పొందిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆందోళన చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ శనివారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన ఆయన హైదరాబాద్ కంచన్‌బాగ్…Read more

8.అందుకే డ్రింకింగ్ మానేశా.. మనసు విప్పిన శ్రుతీ

లోకనాయకుడు కమల్ హాసన్ తనయగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్.. మొదట మ్యూజిక్ డైరక్టర్‌గా, ఆ తరువాత హీరోయిన్‌గా, సింగర్‌గా ఇలా తనలోని వైవిధ్య కళలతో అందరినీ మెప్పించింది. అయితే ఆ మధ్యలో విదేశీయుడితో…Read more

9.విటమిన్ బి6 ఆరోగ్య ప్రయోజనాలు…!

ఫైరిడాక్సిన్ ను B6 విటమిన్ అంటాము. ఇది మూడు రూపాలలో ఉంటుంది. అవి ఫైరిడాక్సిల్, ఫైరిడాక్సిమైన్, ఫైరిడాక్సిన్ లు. అవసరానికి బట్టి ఇవి శరీరంలో రూపాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరానికి అవసరమైన అనేక…Read more

10.కస్టమర్లకు జియో మరో ఫ్రీ ఆఫర్..!

వినియోగదారులకు జియో మరో ఫ్రీ ఆఫర్ తెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్పిన రెండ్రోజుల్లోనే.. జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత…Read more